Ranveer Singh: హీరో రణ్‌వీర్ చెంప చెల్లుమనిపించిన బాడీగార్డ్..!

ABN , First Publish Date - 2022-09-15T01:13:39+05:30 IST

కొత్త రకం పాత్రలు, తనదైన ఫ్యాషన్ స్టైల్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు (Ranveer Singh). కొన్ని రోజుల క్రితం నగ్నంగా ఫొటోలకు ఫోజులిచ్చి వార్తల్లో నిలిచాడు. వివాదాల్లో

Ranveer Singh: హీరో రణ్‌వీర్ చెంప చెల్లుమనిపించిన బాడీగార్డ్..!

కొత్త రకం పాత్రలు, తనదైన ఫ్యాషన్ స్టైల్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh). కొన్ని రోజుల క్రితం నగ్నంగా ఫొటోలకు ఫోజులిచ్చి వార్తల్లో నిలిచాడు. వివాదాల్లో ఇరక్కున్నాడు. తాజాగా రణ్‌వీర్‌కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. రణ్‌వీర్ సింగ్ తాజాగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA 2022)కు హజరయ్యాడు. ఇతర సెలబ్రిటీలతో కలసి సందడి చేశాడు. మోస్ట్ పాపులర్ హిందీ యాక్టర్ అవార్డును అందుకున్నాడు. పురస్కారాన్ని తీసుకున్న అనంతరం బయటకు వస్తున్నప్పుడు అభిమానులందరు ఒక్కసారిగా రణ్‌‌వీర్ మీద పడబోయారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అభిమానులను అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది చాలా కష్టపడ్డారు. అప్పుడే ఓ బాడీగార్డు అనుకోకుండా రణ్‌వీర్ చెంప మీద గట్టిగా కొట్టాడు. దీంతో ఒక్కసారిగా హీరో షాక్‌కు గురయ్యాడు. చెంపను తడుముకున్నాడు. భద్రతా సిబ్బందిని కూడా వారించలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. రణ్‌వీర్ అభిమానులందరు విపరీతంగా షేర్ చేస్తున్నారు. సహనం చూపించినందుకు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.       


రణ్‌వీర్ సింగ్ ఈ ఘటన అనంతరం నవ్వుతూ కనిపించాడు. అభిమానులందరికి కూడా సెల్ఫీలు ఇచ్చాడు. సైమా అవార్డ్స్‌ కోసం అనేక తెలుగు సినిమాలు పోటీపడ్డాయి. ‘పుష్ప’ (Pushpa), ‘అఖండ’ (Akhanda), ‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu) వివిధ విభాగాల్లో నామినేట్ అయ్యాయి. ‘పుష్ప’  ఆరు విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టింది. అల్లు అర్జున్ ఉత్తమ నటుడి పురస్కారాన్ని గెలుపొందాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ సినిమాకు గాను పూజా హెగ్డే ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది.



Updated Date - 2022-09-15T01:13:39+05:30 IST