Dulquer Salman : రివ్యూలు రాసి తక్కువ రేటింగ్ ఇచ్చేవారిని మర్డర్ చేస్తాడా?

ABN , First Publish Date - 2022-09-04T20:44:39+05:30 IST

పదేళ్ళలో 34 సినిమాలు కంప్లీట్ చేసిన ఘనత మలయాళ స్టార్ హీరో దుల్ఖర్ సల్మాన్ (Dulquer Salman) సొంతం. స్టైలిష్ స్ర్కీన్ ప్రెజెన్స్, మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ అతడి ప్రత్యేకతలు. ఏ పాత్ర చేసినా దానికి నూటికి నూరు శాతం న్యాయం చేయడం.. తండ్రి మమ్ముట్టిని చూసి అలవర్చుకున్నాడు. కథలో కొత్తదనం, పాత్రలో ప్రత్యేకత లేకపోతే.. నిర్మొహమాటంగా ఆ సినిమాకి నో చెప్పేస్తాడు.

Dulquer Salman : రివ్యూలు రాసి తక్కువ రేటింగ్ ఇచ్చేవారిని మర్డర్ చేస్తాడా?

పదేళ్ళలో 34 సినిమాలు కంప్లీట్ చేసిన ఘనత మలయాళ స్టార్ హీరో దుల్ఖర్ సల్మాన్ (Dulquer Salman) సొంతం. స్టైలిష్ స్ర్కీన్ ప్రెజెన్స్, మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ అతడి ప్రత్యేకతలు. ఏ పాత్ర చేసినా దానికి నూటికి నూరు శాతం న్యాయం చేయడం.. తండ్రి మమ్ముట్టిని చూసి అలవర్చుకున్నాడు. కథలో కొత్తదనం, పాత్రలో ప్రత్యేకత లేకపోతే.. నిర్మొహమాటంగా ఆ సినిమాకి నో చెప్పేస్తాడు. ఏ భాషలో నటించినా.. ముందుగా ఆ భాషను పూర్తిగా అవగాహన చేసుకొని, అర్ధం చేసుకొని ఆపై నేర్చుకోవడం అతడికి అలవాటు. ‘మహానటి, సీతారామం’ చిత్రాల్లో దుల్ఖర్ సల్మాన్ తన సొంత గొంతుపలికించి.. ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. 


ఇక అసలు మేటర్లోకొస్తే దుల్ఖర్ తాజా నటించిన బాలీవుడ్ చిత్రం ‘చుప్ : ది రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ (Chup : The Revenge Of the Artiste) త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఆర్. బాల్కి (R Balki) దర్శకుడు. అమితాబ్‌ (Amitab) తో ‘పా, చీనీకమ్’, శ్రీదేవి (Sridevi) తో ‘ఇంగ్లీష్ వింగ్లీష్’, అక్షయ్ కుమార్ (Akshay Kumar) తో ‘ప్యాడ్ మేన్’, మిషన్ మంగళ్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన బాల్కీ.. దుల్ఖర్ కోసం ఓ షాకింగ్ కథాంశాన్ని రాసుకున్నాడట. చిత్రం పూర్తిగా సినిమాల నేపథ్యంలోనే ఉంటుందట. దుల్ఖర్ ఇంతకు ముందెన్నడూ చేయని ఓ సరికొత్త పాత్రను ఇందులో చేస్తున్నాడని టాక్. 


సినిమా రివ్యూలు రాసి తక్కువ రేటింగ్ ఇచ్చేవారిని చంపే ఓ సైకో కిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో ఎప్పుడూ చూడని గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లేతో ఈ సినిమా తెరకెక్కుతోందని వినికిడి. అతడు ఎందుకలా చేస్తాడు? సినిమా ఇండస్ట్రీకి ఏమైనా సంబంధం ఉంటుందా? అతడికి, మరో కీలకపాత్ర చేస్తున్న సన్నీడియోల్‌ (Sunny Deol) కు ఎలాంటి కనెక్షన్ ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడాలి. నిజంగా ఎవరికీ రాని ఐడియా ఇది. రివ్యూలు రాసి, తక్కువ రేటింగ్ ఇచ్చేవారిని మర్డర్ చేసే థాట్ బాల్కీకి ఎలా వచ్చిందో మరి. ఏదో హాలీవుడ్ మూవీ ఇన్స్పిరేషన్ గా చెబుతున్నారు. పూజా భట్, శ్రేయా ధన్వంతరి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తెలుగులోనూ ఈ సినిమాను డబ్బింగ్ చేయబోతున్నారు. మరి ‘చుప్’ చిత్రం దుల్ఖర్ కు ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి. 

Updated Date - 2022-09-04T20:44:39+05:30 IST