Sita Ramam: మృణాల్ ఠాకూర్‌ను ఉద్దేశిస్తూ.. ప్రియమైన సీతా మహలక్ష్మీ గారికీ అంటూ దుల్కర్ సల్మాన్ లేఖ

ABN , First Publish Date - 2022-08-02T01:19:30+05:30 IST

టీవీ సీరియల్స్‌తో ఫేమ్ సంపాదించుకుని అనంతరం అనంతరం హీరోయిన్‌గా మారిన అందాల భామ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). ‘సూపర్ 30’ (Super 30), ‘బాట్లా హౌస్’ (Batla House), ‘ధమకా’

Sita Ramam: మృణాల్ ఠాకూర్‌ను ఉద్దేశిస్తూ.. ప్రియమైన సీతా మహలక్ష్మీ గారికీ అంటూ దుల్కర్ సల్మాన్ లేఖ

టీవీ సీరియల్స్‌తో ఫేమ్ సంపాదించుకుని అనంతరం హీరోయిన్‌గా మారిన అందాల భామ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). ‘సూపర్ 30’ (Super 30), ‘బాట్లా హౌస్’ (Batla House), ‘ధమకా’ (Dhamaka) వంటి చిత్రాలతో అభిమానులను అలరించింది. తాజాగా టాలీవుడ్‌కు కూడా ఎంట్రీ ఇవ్వనుంది. దుల్కర్ సల్మాన్‌కు జోడీగా ‘సీతారామం’ లో(Sita Ramam)నటించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 5న విడుదల కానుంది. అయితే.. మృణాల్ ఆగస్టు 1న పుట్టిన రోజు వేడుకలను జరుపుకొంటుంది. ఈ సందర్భంగా దుల్కర్ ఆమెకు లేఖను రాశాడు. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.


‘సీతారామం’ ను వైజయంతి మూవీస్ నిర్మించింది. ఈ సినిమాలో సీతగా మృణాల్ ఠాకూర్, రామ్‌గా దుల్కర్ కనిపించున్నారు. మృణాల్ పుట్టిన రోజు సందర్భంగా ప్రియమైన సీతా మహాలక్ష్మీ గారికీ అంటూ దుల్కర్ లేఖను రాశాడు. ‘‘ప్రియమైన సీతా మహాలక్ష్మీ గారికీ, నేను మొదటిసారి స్క్రిఫ్ట్ విన్నప్పుడు ఈ సినిమాకు టైటిల్ లేదు. నటీ, నటులను కూడా ఎంపిక చేయలేదు. సీతా మహాలక్ష్మీది ప్రత్యేకమైన పాత్ర అని నాకు తెలుసు. నువ్వు ఈ సినిమాలోకి వచ్చి సీతా మహాలక్ష్మీ పాత్రకు జీవం పోశావు. మనం మొదటిసారి షూటింగ్‌లో కలుసుకున్నప్పుడు నువ్వు చెప్పిన మాటలు నాకింకా గుర్తుకున్నాయి. సినిమా చిత్రీకరణ అద్భుతంగా గడిచిందని నాకు తెలుసు. మనం మంచి స్నేహితులుగా మారిపోయాం. నువ్వు అనేక సవాళ్లను, కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని సీత పాత్రను పోషించావు. నువ్వు సీతా మహాలక్ష్మీగా ప్రేక్షకులకు తప్పకుండా గుర్తుకుండిపోతావు. రామ్‌కు సీతగా మారినందుకు కృతజ్ఞతలు. ఆగస్టు 5 వరకు వేచి ఉండలేకపోతున్నాను. పుట్టిన రోజు శుభాకాంక్షలు సీత గారు. ఈ సినిమా మీకు పుట్టిన రోజు కానుక. ఇట్లు మీ రామ్’’ అని దుల్కర్ సల్మాన్ తెలిపాడు.



Updated Date - 2022-08-02T01:19:30+05:30 IST