ఇదే నా చివరి ప్రేమకథ: Dulquer Salmaan

ABN , First Publish Date - 2022-07-26T01:06:10+05:30 IST

అందరూ రొమాంటిక్ హీరో అని పిలవడంతో విసుగొచ్చి ఇంక ప్రేమకథలు చేయకూడదని అనుకున్నాను. ఇలాంటి సమయంలో హనుగారు ఈ కథతో వచ్చారు. అద్భుతమైన ప్రేమ కథ. చిరకాలం గుర్తుండి పోయే ఎపిక్ సినిమా ‘సీతా రామం’. ఇది నా చివరి..

ఇదే నా చివరి ప్రేమకథ: Dulquer Salmaan

‘‘అందరూ రొమాంటిక్ హీరో అని పిలవడంతో విసుగొచ్చి ఇంక ప్రేమకథలు చేయకూడదని అనుకున్నాను.  ఇలాంటి సమయంలో హనుగారు ఈ కథతో వచ్చారు. అద్భుతమైన ప్రేమ కథ. చిరకాలం గుర్తుండి పోయే ఎపిక్ సినిమా ‘సీతా రామం’. ఇది నా చివరి ప్రేమకథ’’ అని అన్నారు స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). ఆయన హీరోగా వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) సమర్పణలో స్వప్న సినిమా (Swapna Cinema) పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ (Aswini Dutt) నిర్మిస్తున్న చిత్రం ‘సీతా రామం’ (Sita Ramam). ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’గా తెరకెక్కిన ఈ చిత్రానికి హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకుడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రలో కనిపించనుంది. బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. 


ఈ కార్యక్రమంలో హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ‘‘అందరూ రొమాంటిక్ హీరో, రొమాంటిక్ హీరో అని పిలుస్తుంటే.. విసుగొచ్చి ఇంక ప్రేమకథలు చేయకూడదని అనుకున్నా.  అలాంటి సమయంలో హనుగారు ఈ కథతో వచ్చారు. అద్భుతమైన ప్రేమ కథ. చిరకాలం గుర్తిండి పోయే ఎపిక్ సినిమా. ఇలాంటి కథని ఎట్టిపరిస్థితిల్లో వదులుకోకూడదని నిర్ణయించుకున్నా. నా చివరి ప్రేమకథగా  ‘సీతా రామం’ వంటి క్లాసిక్ ఎపిక్ లవ్ స్టొరీ చేయాలని ఫిక్సయ్యా. ‘సీతా రామం’ షూటింగ్ అద్భుతమైన అనుభవం. దేశంలోని అనేక ప్రదేశాలలో షూట్ చేశాం. అన్ని ప్రదేశాలు నేను ఎప్పుడూ చూడలేదు. కథని బలంగా నమ్మాము. అందరం వంద శాతం బెస్ట్ వర్క్ ఇచ్చాం. అశ్వినీదత్‌గారి లాంటి సినిమాపై ప్యాషన్ వున్న నిర్మాతతో ఇప్పటివరకూ పని చేయలేదు. అన్ని అవసరాలని సమకూర్చారు. ఎంతో అప్యాయంగా భోజనం పెట్టేవారు.  హనుగారు సినిమాపై గ్రేట్ ప్యాషన్ వున్న రచయిత, దర్శకుడు. ఆయనకి సినిమా తప్పితే మరో ధ్యాస లేదు. సీతగా మృణాల్ అద్భుతంగా చేసింది. రష్మిక పాత్ర కూడా అద్భుతంగా వుంటుంది. గ్రేట్ టీమ్‌తో పనిచేశాననే ఆనందం వుంది. సినిమాలో అద్భుతమైన మ్యూజిక్ వుంది. ‘సీతా రామం’ లార్జర్ దెన్ లైఫ్ సినిమా. ఆగస్ట్ 5న అందరూ థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయండి’’ అని అన్నారు. 

Updated Date - 2022-07-26T01:06:10+05:30 IST