Dulquer Salmaan: సౌత్‌లో ఆ కల్చర్‌ లేదు.. బాలీవుడ్‌లోనే చూశా..

ABN , First Publish Date - 2022-09-16T20:02:03+05:30 IST

కీర్తీ సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన ‘మహానటి’ చిత్రంతో టాలీవుడ్‌లోనూ గుర్తింపు పొందిన మలయాళీ నటుడు ‘దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)’...

Dulquer Salmaan: సౌత్‌లో ఆ కల్చర్‌ లేదు.. బాలీవుడ్‌లోనే చూశా..

కీర్తీ సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన ‘మహానటి’ చిత్రంతో టాలీవుడ్‌లోనూ గుర్తింపు పొందిన మలయాళీ నటుడు ‘దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)’. ఆ సినిమాలో ఆయన నటనకి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఆ క్రేజ్‌తో ఆయన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదల అవుతోంది. ఈ తరుణంలో.. ఈ యువ నటుడు ‘సీతారామం’ అనే డైరెక్ట్ తెలుగు సినిమా చేశాడు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా.. దృశ్యకావ్యం అనే పేరు తెచ్చుకుంది. 


కాగా.. దుల్కర్ కొత్త సినిమా ‘చుప్ ది రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ సెప్టెంబర్ 23న విడుదల కానుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్‌లో చిత్రబృందం బిజీగా ఉంది. ఇందులో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌లో నడుస్తున్న బాయ్‌కాట్ కల్చర్‌ (Boycott Culture)పై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియా కారణంగా బాయ్‌కాట్ కల్చర్ చాలా ఎక్కువగా ఉంది. ఎవరైన ఏదైనా చాలా స్వేచ్ఛగా సోషల్ మీడియాలో వ్రాయవచ్చు. అందుకే.. చాలామంది ఎలాంటి బాధ్యత లేకుండా తమ సొంత అజెండాలతో ఏది పడితే అది రాస్తున్నారు. అందులో ఒకటే  బాయ్‌కాట్ కల్చర్‌. అయితే.. ఆ బాయ్‌కాట్ కల్చర్ దక్షిణాదిలో లేదు. భయకరమైన కల్చర్‌ని బాలీవుడ్‌లోనే మొదట విన్నాం’ అని చెప్పుకొచ్చాడు.


ఈ బాయ్‌కాట్ కల్చర్ వల్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ ‘రక్షా బంధన్’ వంటి పలు సినిమాలు ఫెయిల్యూర్స్‌గా మిగిలాయి. కాగా.. రొమాంటిక్ సైకోపాత్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన దుల్కర్ తాజా చిత్రానికి ఆర్.బాల్కీ దర్శకత్వం వహించాడు.

Updated Date - 2022-09-16T20:02:03+05:30 IST