Dulquer Salmaan: మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్..?

Twitter IconWatsapp IconFacebook Icon
Dulquer Salmaan: మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్..?

మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) మరో స్ట్రైట్ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..? ప్రస్తుతం అవుననే మాట ఇండస్ట్రీ వర్గాలలో గట్టిగానే వినిపిస్తోంది. మహానటి (Mahanati) చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు దుల్కర్ సల్మాన్. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల వచ్చిన సీతా రామం (Sita Ramam) మూవీతో బ్లాక్‌‌బస్టర్ హిట్ అందుకుని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. 

ఈ చిత్రంలో హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur)తో దుల్కర్ సల్మాన్ కెమిస్ట్రీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. అయితే,  ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను మూవీ టీమ్ బాగా ఎంజాయ్ చేస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా మరో టాలీవుడ్ స్ట్రైట్ మూవీకి దుల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో ఓ సినిమా చేసేయనున్నాడట. దుల్కర్ కోసం శేఖర్ కమ్ముల అద్భుతమైన కథ సిద్ధం చేశాడని సమాచారం. కోలీవుడ్ స్టార్ ధనుష్‌తో శేఖర్ కమ్ముల ఓ సినిమా చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి కూడా చాలా నెలలవుతోంది. 

అయితే, ధనుష్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్' అనే సినిమాలో నటిస్తున్నాడు. దీని తరువాత శేఖర్ కమ్ములతో నెక్స్ట్ మూవీని చేయనున్నాడు. ఈ గ్యాప్‌లో దుల్కర్ సల్మాన్‌తో ఓ చిత్రం కంప్లీట్ చేయాలని శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నారట. ధనుష్ 'సార్' సినిమాను కంప్లీట్ చేసేలోపు.. ఆయన ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి. 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.