ఎన్నికల వేళ... ఓటర్లకు క్షమాపణలు చెప్పిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్..

ABN , First Publish Date - 2022-02-20T01:07:57+05:30 IST

ప్రస్తుతం తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలు

ఎన్నికల వేళ... ఓటర్లకు క్షమాపణలు చెప్పిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్..

ప్రస్తుతం తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దలపతి విజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అయితే, పోలింగ్ బూత్‌ వద్దకొచ్చిన విజయ్‌ని ఫొటోలు తీసేందుకు మీడియా ప్రయత్నించింది. దీంతో అదే ప్రాంగంణంలో ఓటు వేసేందుకు వచ్చిన సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగింది. ప్రజలకు కలిగిన అసౌకర్యాన్ని గమనించిన విజయ్ అందరికీ క్షమాపణలు చెప్పాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ అభిమానులు చాలా మంది పోటీ చేస్తున్నారు. ‘‘తలపతి విజయ్ మక్కల్ ఇయక్కం’’ పార్టీ పేరుతో వారు పోటీ చేశారు. గతంలో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ‘‘ఆల్ ఇండియా తలపతి విజయ్ మక్కల్ ఇయక్కం’’ అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. రాజకీయ పార్టీ కోసం తన పేరును ఉపయోగించుకున్నందుకు గతంలో తన తల్లిదండ్రులపై విజయ్ కేసు పెట్టాడు. దీంతో విజయ్ పేరుతో ఉన్న పార్టీని రద్దు చేస్తున్నట్టు అతడి తండ్రి కోర్టుకు తెలిపాడు. ఇక సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం విజయ్ ‘బీస్ట్’ మూవీలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు.



Updated Date - 2022-02-20T01:07:57+05:30 IST