‘దృశ్యం’ పాప అందాల విందుపై నెటిజన్ల షాకింగ్ కామెంట్స్

ABN , First Publish Date - 2021-12-26T04:01:01+05:30 IST

మలయాళంలో బాలనటిగా అడుగుపెట్టిన ఎస్తర్‌ అనిల్‌.. ఆ తర్వాత అగ్రహీరో మోహన్‌లాల్‌ - మీనా జంటగా నటించిన ‘దృశ్యం’ చిత్రంలో వారి కుమార్తెగా నటించింది. ఆ తర్వాత కమల్‌ హాసన్‌ - గౌతమి జంటగా వచ్చిన తమిళ ‘పాపనాశం’లో, వెంకటేష్‌ - మీనా నటించిన..

‘దృశ్యం’ పాప అందాల విందుపై నెటిజన్ల షాకింగ్ కామెంట్స్

మలయాళంలో బాలనటిగా అడుగుపెట్టిన ఎస్తర్‌ అనిల్‌.. ఆ తర్వాత అగ్రహీరో మోహన్‌లాల్‌ - మీనా జంటగా నటించిన ‘దృశ్యం’ చిత్రంలో వారి కుమార్తెగా నటించింది. ఆ తర్వాత కమల్‌ హాసన్‌ - గౌతమి జంటగా వచ్చిన తమిళ ‘పాపనాశం’లో, వెంకటేష్‌ - మీనా నటించిన తెలుగు ‘దృశ్యం’లోనూ ఇదే పాత్రను పోషించింది. కాగా రెండు పదుల వయస్సు నిండిన ఎస్తర్‌ హీరోయిన్‌ అవకాశాల కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఎక్స్‌పోజింగ్‌ చేస్తూ దిగిన ఫొటోలతో ప్రతి ఒక్కరి దృష్టిని తనవైపునకు తిప్పుకుంటోంది. ఇప్పుడు ఆ ఫొటోలు సోష‌ల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆమె లేలేత అందాలు నెటిజన్లను బాగా ఆకర్షిస్తున్నాయి. అప్పుడే ఇంతలా ఆరబోస్తోంది ఏమిటి?.. అని కొందరు నెటిజన్లు కామెంట్స్ కూడా చేస్తున్నారనుకోండి.. అదే వేరే విషయం. మరి ఇంతగా అందాలను ఆరబోస్తూ.. అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ఆమెను ఎలాంటి అవకాశాలు వరించనున్నాయో.. చూద్దాం.





Updated Date - 2021-12-26T04:01:01+05:30 IST