Ayushmann Khurrana: పారితోషికం తగ్గించుకున్న బాలీవుడ్ హీరో.. ఒక్కో చిత్రానికి ఎంత ఛార్జ్ చేస్తున్నాడంటే..

ABN , First Publish Date - 2022-09-29T00:00:27+05:30 IST

విభిన్న సినిమాలు, విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana). బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నాడు. కాన్సెఫ్ట్

Ayushmann Khurrana: పారితోషికం తగ్గించుకున్న బాలీవుడ్ హీరో.. ఒక్కో చిత్రానికి ఎంత ఛార్జ్ చేస్తున్నాడంటే..

విభిన్న సినిమాలు, విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana). బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నాడు. కాన్సెఫ్ట్ ఆధారిత సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. ‘విక్కీ డోనర్’ (Vicky Donor), ‘బాధాయి హో’ (Badhaai Ho), ‘డ్రీమ్ గర్ల్’ (Dream Girl) వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. అయితే, కరోనా అనంతరం బాలీవుడ్‌లో ఏ సినిమాలు నడవడం లేదు. అందువల్ల నిర్మాతలకు అండగా నిలబడాలని ఆయుష్మాన్ రెమ్యూనరేషన్‌ను తగ్గించుకున్నాడని తెలుస్తోంది.  


ఆయుష్మాన్ ఖురానా సక్సెస్‌లో ఉన్నప్పుడు ఒక్కో సినిమాకు రూ.25కోట్లు ఛార్జ్ చేసేవాడు. కరోనా అనంతరం బాక్సాఫీస్ వద్ద ఏ సినిమాలు నడవడం లేదు. అతడు నటించిన ‘అనేక్’, ‘చండీగఢ్ కరే ఆషికి’ సినిమాలు కూడా పరాజయం పాలయ్యాయి. దీంతో అతడు నిర్మాతలకు అండగా ఉండాలనుకున్నాడు. రెమ్యూనరేషన్‌ను తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాడు. పారితోషికాన్ని రూ.15కోట్లకు తగ్గించుకున్నాడని పుకార్లు షికార్లు కొడుతున్నాయి.  ప్రస్తుతం ‘డ్రీమ్ గర్ల్-2’ (Dream Girl 2)లో నటిస్తున్నాడు. ఈ ఏడాది చివరి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆయుష్మాన్ మాత్రమే కాదు. బాలీవుడ్‌లో అనేక మంది హీరోలు తమ రెమ్యూనరేషన్‌ను భారీగా తగ్గించుకున్నారు. అక్షయ్ కుమార్, జాన్ అబ్రహాం, షాహిద్ కపూర్, రాజ్‌కుమార్ రావ్ తమ ఫీజును సగానికి తగ్గించుకున్నారని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. తాను హీరోగా నటించిన సినిమాలను తన పిల్లలకు చూపించనని ఆయుష్మాన్ గతంలో చెప్పాడు. అందుకు గల కారణాన్ని కూడా వివరించాడు. ‘‘నా ఇద్దరు పిల్లలకు 13-14ఏళ్లు వచ్చే వరకు నా సినిమాలను చూపెట్టను. ఎందుకంటే వారు నన్ను స్టార్‌గా చూడకూడదు. బాల్యాన్ని వారు ఆస్వాదించాలి. అందుకే వారికి నా సినిమాలను చూపించకూడదని నిర్ణయించుకున్నాను’’ అని ఆయుష్మాన్ ఖురానా తెలిపాడు. 


Updated Date - 2022-09-29T00:00:27+05:30 IST