రామానాయుడు(Ramanaidu) 86వ జయంతి వేడుకలు!

ABN , First Publish Date - 2022-06-07T20:54:25+05:30 IST

నేస్తం ఫౌండేషన్‌, తెలుగు సినిమా వేదిక, కూనిరెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మూవీ మొఘల్‌ డా.డి. రామానాయుడు 86వ జయంతి కార్యక్రమం సోమవారం జరిగింది.

రామానాయుడు(Ramanaidu) 86వ జయంతి వేడుకలు!

నేస్తం ఫౌండేషన్‌, తెలుగు సినిమా వేదిక, కూనిరెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మూవీ మొఘల్‌ డా.డి. రామానాయుడు (D ramanaidu)86వ జయంతి కార్యక్రమం సోమవారం జరిగింది. తెలుగు నిర్మాత మండలి హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో సురేశ్‌ ప్రొడక్షన్స్‌లో పని చేసిన దర్శకులు బోయిన సుబ్బారావు, వై.నాగేశ్వరరావు, కె.సదాశివ రావు, జయంత్‌ సి పరాన్జీ, కాశీ విశ్వనాథ్‌, ముప్పలనేని శివ, చంద్ర మహేష్‌, వి.యన్‌.ఆదిత్య, పి.సునీల్‌ కుమార్‌ రెడ్డిలతోపాటు రామానాయుడిపై ‘మూవీమొఘల్‌’ పుస్తకాన్ని రచించిన సీనియర్‌ జర్నలిస్ట్‌ యు.వినాయకరావులకు రామానాయుడు స్మారక పురస్కారం అందజేశారు. అతిథులుగా హాజరైన తమ్మారెడ్డి, భరద్వాజ, వి.విజయేంద్ర ప్రసాద్‌,  ఫిల్మ్‌ చాంబర్‌ అధ్యక్షులు కొల్లి రామకృష్ణ, కార్యదర్శి కె.యల్‌. దామోదర ప్రసాద్‌, నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్‌, ఫిల్మ్‌ నగర్‌ హౌసింగ్‌ సొసైటీ కార్యదర్శి కాజా సూర్యనారాయణ, నిర్మాతలు ఏ. గురురాజ్‌ తదితరులు రామానాయుడు గొప్పతనాన్ని కొనియాడారు. 


Updated Date - 2022-06-07T20:54:25+05:30 IST