Dongalunnaru Jagratha.. విడుదల ఎప్పుడో చెప్పేశారు

ABN , First Publish Date - 2022-08-18T00:08:47+05:30 IST

యువ హీరో శ్రీ సింహ కోడూరి (Sri Simha Koduri), ప్రీతి అస్రాని (Preethi Asrani) హీరోహీరోయిన్లుగా.. డి సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్‌, సునీత తాటి గురు ఫిలింస్‌ సంయుక్త నిర్మాణంలో

Dongalunnaru Jagratha.. విడుదల ఎప్పుడో చెప్పేశారు

యువ హీరో శ్రీ సింహ కోడూరి (Sri Simha Koduri), ప్రీతి అస్రాని (Preethi Asrani) హీరోహీరోయిన్లుగా.. డి సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్‌, సునీత తాటి గురు ఫిలింస్‌ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం 'దొంగలున్నారు జాగ్రత్త' (Dongalunnaru Jagratha). డిఫరెంట్ థ్రిల్లర్‌‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సతీష్ త్రిపుర (Satish Tripura) దర్శకుడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించి ఉన్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.


తెలుగులో తొలి సర్వైవల్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఈ పోస్టర్‌లో తెలిపారు. ఈ అనౌన్స్ మెంట్ పోస్టర్ విషయానికి వస్తే.. ఒకవైపు సింహ కోడూరి, మరో వైపు సముద్రఖని (Samuthirakani) ఒకే మొహంగా కనిపించడం ఆసక్తికరంగా వుంది. సింహా కాస్త సీరియస్‌గా కనిపిస్తుండగా.. సముద్రఖని నుదుటిపై వేళ్లు పెట్టుకుని తీక్షణంగా చూస్తున్నారు. అలాగే ఈ సినిమాలో కారు కీలక పాత్ర పోషిస్తుందనేది.. ఈ పోస్టర్‌లో కారును చూస్తుంటే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

ఒక దొంగతనం బెడిసికొట్టిన తర్వాత.. ఒక దొంగ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. తర్వాత అతని జీవితం శాశ్వతంగా ఎలా మారిపోయింది?.. అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లుగా మేకర్స్ తెలుపుతున్నారు. కాగా, అత్యున్నత సాంకేతిక బృందం పని చేస్తున్న ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. (Dongalunnaru Jagratha Release Date)

Updated Date - 2022-08-18T00:08:47+05:30 IST