RRR పై మార్వెల్ సినిమా Doctor Strange రచయిత ప్రశంసలు.. చిత్రమైన బ్లాక్‌బస్టర్ అంటూ..

ABN , First Publish Date - 2022-06-09T15:16:27+05:30 IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో యంగ్ హీరోలు రామ్‌చరణ్ (Ram Charan), ఎన్‌టీఆర్ (NTR) నటించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’....

RRR పై మార్వెల్ సినిమా Doctor Strange రచయిత ప్రశంసలు.. చిత్రమైన బ్లాక్‌బస్టర్ అంటూ..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో యంగ్ హీరోలు రామ్‌చరణ్ (Ram Charan), ఎన్‌టీఆర్ (NTR) నటించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. 20 శతాబ్దంలో భారతీయ స్వాతంత్య్ర సమరయోధులు కుమురం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా సృష్టించిన కల్పిత కథతో ఈ సినిమా తెరకెక్కింది. మార్చి 25న విడుదలైన ఈ మూవీ సంచలన విజయాన్ని అందుకొని ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1200 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. అప్పటి నుంచి ఎవరో ఒక సెలబ్రిటీ ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఇటీవలే ఈ సినిమా OTTలో విడుదలైంది. తాజాగా ఈ మూవీ మార్వెల్ మూవీ ‘డాక్టర్ స్ట్రేంజ్’ మూవీ రైటర్ రాబర్ట్ కార్గిల్ ఈ సినిమాపై ప్రశంసలు సోషల్ మీడియాలో కురిపించాడు. 


రాబర్ట్ చేసిన ట్వీట్‌లో.. ‘గత రాత్రి నా స్నేహితులు నా దగ్గరకి వచ్చి నాకు RRR (రైజ్ రోర్ రివోల్ట్) చూపించారు. అది చూసిన తర్వాత ఓ కల్ట్ మూవీ అభిమానుల్లో నేను ఒకడిగా మారిపోయాను. నేను చూసిన సినిమాల్లో అత్యంత క్రేజీ, అత్యంత నిజాయతీతో కూడిన చిత్రమైన బ్లాక్‌బస్టర్. జెస్, నేను ఈ వారంలో మరోసారి ఈ మూవీని చూస్తామని నాకు ఖచ్చితంగా తెలుసు’ అని రాసుకొచ్చాడు. కాగా.. ఈ ట్వీట్ ఇప్పటివరకూ 16వేలకు పైగా లైక్స్ సాధించడం విశేషం.



Updated Date - 2022-06-09T15:16:27+05:30 IST