RRR ను ప్రశంసించిన Doctor Strange దర్శకుడు.. ఏమన్నాడంటే..

ABN , First Publish Date - 2022-07-17T22:17:54+05:30 IST

దర్శక ధీరుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR). డీవీవీ ఎంటర్ టైన్‌మెంట్ నిర్మించింది. జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా

RRR ను ప్రశంసించిన Doctor Strange దర్శకుడు.. ఏమన్నాడంటే..

దర్శక ధీరుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR). డీవీవీ ఎంటర్‌టై‌న్‌మెంట్ నిర్మించింది. జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా నటించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ (Ajay Devgan), ఆలియా భట్ (Alia Bhatt), ఒలివియా మోరిస్(Olivia Morris) కీలక పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ మార్చి 25న విడుదలైంది. రూ.1100కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో మే 20నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను డిజిటల్ ప్లాట్‌ఫాంలో చూసిన వారంతా ప్రశంసిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టాప్ హాలీవుడ్ డైరెక్టర్ చేరాడు.

 

మార్వెల్ కామిక్స్ నుంచి వచ్చి ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టిన సినిమా ‘డాక్టర్ స్ట్రేంజ్’ (Doctor Strange). ఈ చిత్రానికీ స్కాట్ డెరిక్సన్ (Scott Derrickson) దర్శకత్వం వహించాడు. తాజాగా అతడు ‘ఆర్‌ఆర్‌ఆర్’ ని వీక్షించాడు. అనంతరం ఈ చిత్రాన్ని ప్రశంసలతో ముంచెత్తాడు. ‘‘భార్య, పిల్లలతో నా పుట్టిన రోజును గత రాత్రి జరుపుకొన్నాను. అనంతరం ‘ఆర్ఆర్ఆర్’ ను చూశాను. ఈ సినిమా నాకెంతో నచ్చింది. అద్భుతమైన రోలర్ కోస్టర్ రైడ్’’ అని  సోషల్ మీడియాలో స్కాట్ పోస్ట్ పెట్టాడు. ఈ ట్వీట్‌ను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ తమ ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసింది. ధన్యవాదాలు అని పోస్ట్ పెట్టింది. కొన్ని రోజుల క్రితమే ‘డాక్టర్ స్ట్రేంజ్’ స్క్రీన్ రైటర్ జాన్ స్పైహ్ట్స్ (John Spaihts) ‘ఆర్ఆర్ఆర్’ పై పొగడ్తలపై వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. 



Updated Date - 2022-07-17T22:17:54+05:30 IST