Aryan Khan కు క్లీన్ చిట్ రాగానే మరో హాట్ టాపిక్.. రూ.25 లక్షల విలువైన షారూఖ్ ఇంటి నేమ్ ప్లేట్ మిస్సింగ్..!?

ABN , First Publish Date - 2022-05-28T23:30:00+05:30 IST

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్(Shah Rukh Khan) కుమారుడు ఆర్యన్ ఖాన్‌ (Aryan Khan)కు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)అధికారులు మే 27న క్లీన్ చిట్ ఇచ్చారు. డ్రగ్స్-ఆన్-క్రూయిజ్ కేసులో ఆర్యన్ ఖాన్, మరో ఐదుగురిపై నమోదైన ఆరోపణలను

Aryan Khan కు క్లీన్ చిట్ రాగానే మరో హాట్ టాపిక్.. రూ.25 లక్షల విలువైన షారూఖ్ ఇంటి నేమ్ ప్లేట్ మిస్సింగ్..!?

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్(Shah Rukh Khan) కుమారుడు ఆర్యన్ ఖాన్‌ (Aryan Khan)కు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)అధికారులు మే 27న క్లీన్ చిట్ ఇచ్చారు. డ్రగ్స్-ఆన్-క్రూయిజ్ కేసులో ఆర్యన్ ఖాన్, మరో ఐదుగురిపై నమోదైన ఆరోపణలను రుజువు చేసేందుకు తగిన సాక్ష్యాధారాలు లేవని తెలిపారు. ఆర్యన్‌కు క్లీన్ చిట్ రాగానే షారూక్ ఇల్లు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. కింగ్ ఖాన్ ఇంటి నేమ్‌ ప్లేట్ (Name Plate) మిస్ అయిందని బీ టౌన్ మీడియాలో పుకార్లు షికార్లు కొట్టాయి.


షారూఖ్ ఖాన్ ఇంటిపేరు ‘మన్నత్’(Mannat). ముంబై మహానగరంలోని పాపులర్ టూరిస్ట్ ప్రదేశాల్లో ఆ ఇల్లు కూడా ఒకటి. షారూఖ్ అభిమానులందరు ఆ ఇంటి ముందు ఫొటోలు కూడా తీసుకుంటారు. కొన్నేళ్ల అనంతరం కింగ్ ఖాన్ ఇంటి వద్ద కొత్త నేమ్ ‌ప్లేట్‌ను ఏప్రిల్‌లో ఏర్పాటు చేశారు. దీంతో స్టార్ హీరో ఇల్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. తాజాగా ఈ ప్లేట్ మిస్ అయిందని సోషల్ మీడియాలో వదంతులు షికార్లు చేయడం ప్రారంభించాయి. అందుకు కారణమేంటంటే.. ఓ వ్యక్తి హీరో ఇంటి ముందు వీడియో తీసుకున్నాడు. ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఆ ట్రెండింగ్ వీడియోలో నేమ్‌ ప్లేట్  ‘మన్నత్’ కనిపించలేదు. ‘‘నేడు షారూఖ్ ఇంటి వద్దకు నేను వెళ్లాను. నా జీవితంలోనే మొదటిసారిగా అక్కడ ప్లేట్ కనిపించలేదు’’ అని ఆ నెటిజన్ తెలిపాడు. కొందరు మాత్రం ఆ ప్లేట్ చొరీకి గురయిందని పేర్కొన్నారు. మరికొందరు మాత్రం భద్రతా కారణాల రీత్యా దానిని తొలగించారని వెల్లడించారు. ప్రస్తుతం ఆ నేమ్‌ ప్లేట్‌ను రిపేర్ చేస్తున్నారని, గతంలో ఎక్కడ ఉండేదో అక్కడే ఉంచుతారని బాలీవు్ బాద్ షాతో సన్నిహితంగా మెలిగేవారు పేర్కొన్నారు. ఈ నేమ్ ప్లేట్ ఖరీదు రూ.25లక్షలు ఉంటుందని బీ టౌన్ వర్గాలు పేర్కొంటున్నాయి.



Updated Date - 2022-05-28T23:30:00+05:30 IST