Vikram Movie: Vijay Sethupathi, Fahadh Faasil, Kamal Haasan రెమ్యూనరేషన్ ఎంతెంతో తెలుసా..?

ABN , First Publish Date - 2022-06-02T00:29:36+05:30 IST

ప్రయోగాత్మక పాత్రలతో విలక్షణ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు కమల్ హాసన్ (Kamal Haasan). ఆయన తాజాగా చిత్రం ‘విక్రమ్’ (Vikram). యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. స్టార్ డైరెక్టర్ లోకేష్

Vikram Movie: Vijay Sethupathi, Fahadh Faasil, Kamal Haasan రెమ్యూనరేషన్ ఎంతెంతో తెలుసా..?

ప్రయోగాత్మక పాత్రలను పోషిస్తూ విలక్షణ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు కమల్ హాసన్ (Kamal Haasan). ఆయన తాజాగా నటించిన చిత్రం ‘విక్రమ్’ (Vikram). యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించారు. ‘విక్రమ్’ ను పాన్ ఇండియాగా రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న పలు భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. అనిరుధ్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే మంచి విజయాన్ని సాధించాయి. సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. కమల్ ఈ సినిమాలో ‘పతళ పతళ’ అనే పాటను రాసి ఆలపించారు. ఈ సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేషన్ అయింది.    


‘విక్రమ్’ ను కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (Raaj Kamal Films International) తో కలసి ఆర్ మహేంద్రన్‌(R Mahendran) నిర్మించారు. ఈ చిత్రంలో స్టార్ హీరోలు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) , ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) కీలక పాత్రలు పోషించారు. అందుకోసం భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. కమల్ హాసన్ రూ. 50కోట్లను రెమ్యునరేషన్‌గా తీసుకున్నాడని వదంతులు షికార్లు కొడుతున్నాయి. విజయ్ సేతుపతి రూ. 10కోట్లు, ఫహద్ ఫాజిల్ రూ.4కోట్లు ఛార్జ్ చేశారని సమాచారం. దర్శకుడు లోకేశ్ రూ. 8కోట్లను పారితోషకంగా తీసుకున్నాడట. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రూ. 4కోట్లు అందుకున్నాడట.  సినిమా నిర్మాణ వ్యయం రూ. 120కోట్లని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. ప్రచార కార్యక్రమాల కోసం రూ. 5కోట్లను కేటాయించారు. ఈ సినిమా విడుదలకు ముందే రూ. 200కోట్ల బిజినెస్ చేసింది. మరి, ‘విక్రమ్’ ఆ స్థాయిలో వసూళ్లను రాబడుతుందా అంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Updated Date - 2022-06-02T00:29:36+05:30 IST