‘గంగూబాయి కతియవాడి’కి భారీగా రెమ్యునరేషన్ తీసుకున్న అలియా భట్, అజయ్ దేవగణ్..!

ABN , First Publish Date - 2022-03-01T20:54:08+05:30 IST

చిన్న వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ నటిగా

‘గంగూబాయి కతియవాడి’కి భారీగా రెమ్యునరేషన్ తీసుకున్న అలియా భట్, అజయ్ దేవగణ్..!

చిన్న వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ నటిగా మారిన సుందరి అలియా భట్. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ‘రాజీ’, ‘కపూర్ అండ్ సన్స్’, ‘హైవే’ చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘గంగూబాయి కతియవాడి’. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించాడు. అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటించాడు. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోతుంది. నాలుగు రోజుల్లోనే దాదాపుగా రూ.50కోట్ల వసూళ్లను సాధించింది. 


‘గంగూబాయి కతియవాడి’ని దాదాపుగా రూ.100కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ చిత్రంలో నటించినందుకు అలియా, అజయ్ దేవగణ్‌ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. అలియా దాదాపుగా రూ. 20కోట్లను రెమ్యునరేషన్‌గా అందుకుందని బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అజయ్ ఈ చిత్రంలో రామ్ లాల అనే అతిథి పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ పాత్రలో కనిపించినందుకు అతడు కూడా రూ.11కోట్లను పారితోషికంగా తీసుకున్నాడని బాలీవుడ్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ ఆధారంగా ఈ చిత్రాన్ని సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించాడు.


Updated Date - 2022-03-01T20:54:08+05:30 IST