Kareena Kapoor కు ఎన్ని కోట్ల ఆస్తి, పాస్తులు ఉన్నాయో తెలుసా..?

ABN , First Publish Date - 2022-07-05T23:32:24+05:30 IST

సినీ కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న అందాల భామ కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor). రెండు దశాబ్దాల క్రిత ‘రెఫ్యూజీ’ (Refugee) తో సినీ ఇండస్ట్రీకి

Kareena Kapoor కు ఎన్ని కోట్ల ఆస్తి, పాస్తులు ఉన్నాయో తెలుసా..?

సినీ కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న అందాల భామ కరీనా కపూర్ (Kareena Kapoor). రెండు దశాబ్దాల క్రిత ‘రెఫ్యూజీ’ (Refugee) తో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అనేక సినిమాల్లో నటించింది. కొన్నాళ్లకు  సైఫ్ అలీ ఖాన్‌(Saif Ali Khan) ను పెళ్లి చేసుకుంది. అయినప్పటికీ సక్సెస్ ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తుంది. అభిమానులందరూ ముద్దుగా ‘బెబో’ అని పిలుస్తుంటారు. సినిమాల్లో నటించడానికి కరీనా భారీగా పారితోషికాన్ని అందుకుంటుందట. పౌరాణిక గాథలో సీత పాత్రను చేయడానికి తాజాగా రూ. 12కోట్లు డిమాండ్ చేసిందని వార్తలొచ్చాయి. ‘బెబో’ కు ఆస్తిపాస్తులు భారీగానే ఉన్నాయని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. ఈ నేపథ్యంలో వాటిపై ఓ లుక్కేద్దామా మరి.. 

 

కరీనా కపూర్ ఆదాయం ఏడాదికి రూ. 12కోట్లు ఉంటుందట. సినిమాలు, బ్రాండ్స్ ప్రమోషన్స్, ఫొటో షూట్స్‌తో సహా వివిధ మార్గాల్లో ఈ ఆదాయం వస్తుందట. ఆమె ఆస్తి, పాస్తుల విలువ రూ. 440కోట్లు అని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. తన భర్త సైఫ్ అలీఖాన్, పిల్లలతో కలసి కరీనా బాంద్రాలోని 4-బీహెచ్‌కే అపార్ట్‌మెంట్‌లో నివాసముంటుంది. ఆమె గతంలో ‘ఫార్చూన్ హైట్స్’ లో ఉండేది. కరీనా ప్రస్తుతం భర్తతో కలసి స్విట్జర్లాండ్‌లోని జిస్టాడ్‌లో హాలీడేను ఎంజాయ్ చేస్తుంది. బెబోకు స్విస్‌లోను ఇల్లు ఉంది. ముంబై‌లోని ఇంటి ఖరీదు రూ. 55కోట్లు కాగా, జిస్టాడ్‌లోని భవనం ఖరీదు రూ. 33కోట్లు అని సమాచారం.      


కరీనా కపూర్‌కు కార్లంటే కూడా మక్కువ. అందుకే తన గ్యారేజీలో అనేక విలాసవంతమైన కార్స్‌కు చోటిచ్చింది. రూ. 1.4కోట్ల విలువ జేసే మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, రూ. 2.32కోట్ల ఖరీదు చేసే లెక్సస్ ఎల్‌ఎక్స్, ఆడి క్యూ-7, రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌యూవీలను సొంతం చేసుకుంది. కరీనా తాజాగా ‘లాల్ సింగ్ చద్దా’ (Laal Singh Chaddha) లో నటించింది. ఆమిర్ ఖాన్ (Aamir Khan) హీరోగా నటించాడు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించాడు. హాలీవుడ్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’ (Forrest Gump) కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2022, ఆగస్టు 11న విడుదల కానుంది. 

Updated Date - 2022-07-05T23:32:24+05:30 IST