లతాజీ ఆస్తుల విలువెంతో తెలుసా..!

ABN , First Publish Date - 2022-02-07T02:20:03+05:30 IST

లతా మంగేష్కర్‌ చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్‌ సింగర్‌గా

లతాజీ ఆస్తుల విలువెంతో తెలుసా..!

లతా మంగేష్కర్‌ చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్‌ సింగర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆమె తండ్రి మరణించడంతో తప్పనిసరై పాటలు పాడేందుకు చిత్ర పరిశ్రమలోకి రావాల్సి వచ్చిందని గతంలో ఎన్నో సార్లు చెప్పారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. లతాజీ ఓ మరాఠీ చిత్రంతో తొలిసారి నేపథ్య గాయనిగా మారారు. సినిమా ఎడిటింగ్‌లో ఆ పాటను తీసేశారు. కానీ, ఆ తర్వాత ఆమె ప్రస్థానం ఊహించని రీతిలో మలుపు తిరిగింది. కొన్నివేల పాటలతో సంగీత ప్రియులను మైమరిపించిన లతాజీ తాజాగా 92ఏళ్ల వయసులో కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్‌ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 


లతా మంగేష్కర్ ఐదేళ్ల ప్రాయంలోనే గాయనిగా ప్రస్థానం ఆరంభించారు. వివిధ భాషల్లో దాదాపుగా 50వేల పైచిలుకు పైగా పాటలు పాడి శ్రోతలను అలరించారు. సుదీర్ఘమైన కెరీర్‌‌లో ఎన్నో వేల పాటలు పాడిన లతాజీ రెమ్యునరేషన్‌ కూడా అత్యధికంగానే తీసుకునేవారు. 1950వ దశకంలో ఒక్కో పాటకు సుమారు 500 రూపాయల పారితోషికాన్ని అందుకునేవారట. అప్పట్లో ఆశా భోంస్లే సహా పేరున్న సింగర్స్‌కి సైతం 150 రూపాయలు మాత్రమే ఇచ్చేవారట. ఆ సమయంలోనే లతాజీకి అందరి కంటే అత్యధికంగా రెమ్యునరేషన్‌ ఇచ్చేవారని స్వయంగా ఆశా భోంస్లేనే ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మొదట్లో 25 రూపాయలతో ప్రారంభమైన ఆమె సంపాదన ప్రస్తుతం వంద కోట్లకు పైగా చేరుకుంది. ఆమెకు ముంబైతో సహా పలు నగరాల్లో విలాసవంతమైన భవనాలు, లగ్జరీ కార్లు ఉన్నాయి. చనిపోయే నాటికి లతా మంగేష్కర్‌ ఆస్తుల విలువ సుమారు రూ. 200 కోట్లకు పైగానే ఉందని సమాచారం.

Updated Date - 2022-02-07T02:20:03+05:30 IST