బాలీవుడ్ బ్యూటీ Disha Patani రిజెక్ట్ చేసిన బిగ్ ప్రాజెక్టులివే

ABN , First Publish Date - 2022-06-13T21:56:10+05:30 IST

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ దిశా పటానీ (Disha Patani). బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అన్నిఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తుంది. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన

బాలీవుడ్ బ్యూటీ Disha Patani రిజెక్ట్ చేసిన బిగ్ ప్రాజెక్టులివే

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ దిశా పటానీ (Disha Patani). బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తుంది. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘లోఫర్’(loafer) తో హీరోయిన్‌గా మారింది. ఈ మూవీ అనంతరం హిందీ నుంచి ఆమెకు వరుసగా అవకాశాలు రావడంతో ముంబైలోనే స్థిరపడింది. బీ టౌన్‌లో తొలి ప్రాజెక్టుగా ‘ఎమ్‌ఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’(MS Dhoni: The Untold Story) చిత్రంలో నటించింది. ఈ మూవీలో సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్ సరసన హీరోయిన్‌గా మెప్పించింది. అనంతరం ‘బాఘీ-2’, ‘భారత్’, ‘మలంగ్’ వంటి సక్సెస్ ఫుల్ సినిమాలు చేసింది. ప్రస్తుతం ‘ఏక్ విలన్ రిటర్న్స్’, ప్రాజెక్ట్-కె’ వంటి చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. జూన్ 13న దిశ పుట్టిన రోజు జరుపుకొంటుంది. ఈ సందర్భంగా గతంలో ఆమె రిజెక్ట్ చేసిన బిగ్ ప్రాజెక్టులపై ఓ లుక్కేద్దామా..


మిషన్ మంగళ్ (Mission Mangal):

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సినిమా ‘మిషన్ మంగళ్’ (Mission Mangal). ఈ చిత్రంలో విద్యా బాలన్, తాప్సీ, సోనాక్షి సిన్హా, కృతి కుల్హరి, నిత్యా మీనన్ కీలక పాత్రలు పోషించారు. ఈ పాత్రల్లో ఒక దానికోసం ఆమెను సంప్రదించగా రిజెక్ట్ చేసిందట. 


లైగర్ (Liger):

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా ‘లైగర్’. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియాగా పలు భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం మొదటగా దిశనే సంప్రదించగా ఆమె ఒప్పుకోలేదట. 


పుష్ప (Pushpa):

లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ‘ఊ అంటవా’ అనే పాట ఎంత సెన్సేషన్ అయిందో అందరికీ తెలుసు. మొదటగా ఈ సాంగ్‌ను చేయమని దిశనే అడిగారు. కానీ, అందుకు ఆమె అంగీకరించలేదు.

Updated Date - 2022-06-13T21:56:10+05:30 IST