Vikram‌ లో విజయ్ సేతుపతి కంటే ముందు విలన్‌గా ఎవరిని అనుకున్నారో తెలుసా..!

ABN , First Publish Date - 2022-06-09T21:03:10+05:30 IST

విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) తాజాగా నటించిన సినిమా ‘విక్రమ్’ (Vikram). లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించారు. పాన్ ఇండియాగా ఈ మూవీ రూపొందింది.

Vikram‌ లో విజయ్ సేతుపతి కంటే ముందు విలన్‌గా ఎవరిని అనుకున్నారో తెలుసా..!

విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) తాజాగా నటించిన సినిమా ‘విక్రమ్’ (Vikram). లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించారు. పాన్ ఇండియాగా ఈ మూవీ రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న పలు భాషల్లో ఈ సినిమా విడుదలైంది. ‘విక్రమ్’ విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దుసుకుపోతుంది. భారీ వసూళ్లను రాబడుతుంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో రెండు మిలియన్ డాలర్స్‌ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. కేరళలో ఆల్‌టైం నం-1 తమిళ సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) కీలక పాత్రలు పోషించారు. సూర్య అతిథి పాత్రలో మెరిశారు. 


‘విక్రమ్’ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 200కోట్లకు పైగా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా సంతానం అనే పాత్రలో కనిపించారు. ఆయన నటనకు అభిమానుల మన్ననలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. కానీ, మేకర్స్ విజయ్ సేతుపతి పాత్రకు ముందుగా వేరే వాళ్లను అనుకున్నారు. ఈ విషయాన్ని సినిమాలో విజయ్‌కు రైట్ హ్యాండ్‌గా వ్యవహారించిన జాఫర్ సాదిక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రతినాయకుడి పాత్ర కోసం ముందుగా ప్రభు దేవా లేదా రాఘవ లారెన్స్‌ను తీసుకోవాలని మేకర్స్ భావించారని తెలిపారు. ఏమైందో తెలియదు కానీ చివరకు ఆ పాత్ర విజయ్‌కు దక్కింది. ‘విక్రమ్’ ను కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (Raaj Kamal Films International) తో కలసి ఆర్ మహేంద్రన్‌(R Mahendran) నిర్మించారు. ఈ సినిమా నిర్మాణ వ్యయం రూ. 120కోట్లని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. ప్రచార కార్యక్రమాల కోసం రూ. 5కోట్లను కేటాయించారు. ఈ చిత్రం విడుదలకు ముందే రూ. 200కోట్ల బిజినెస్ చేయడం విశేషం. 

Updated Date - 2022-06-09T21:03:10+05:30 IST