వామ్మో Katrina Kaif కు ఇంత ఆస్తి ఉందా.. ఆ వివరాలు తెలిస్తే ఎవరైనా సరే అవాక్కవ్వాల్సిందే..

ABN , First Publish Date - 2021-11-12T23:06:11+05:30 IST

బ్రిటన్ నుంచి వచ్చినా బాలీవుడ్‌లో హీరోయిన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటి కత్రినా కైఫ్. నటనతో మాత్రమే కాకుండా డ్యాన్స్‌తోను అభిమానులను అలరిస్తుంటుంది.

వామ్మో Katrina Kaif కు ఇంత ఆస్తి ఉందా.. ఆ వివరాలు తెలిస్తే ఎవరైనా సరే అవాక్కవ్వాల్సిందే..

బ్రిటన్ నుంచి వచ్చినా బాలీవుడ్‌లో హీరోయిన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటి కత్రినా కైఫ్. నటనతో మాత్రమే కాకుండా డ్యాన్స్‌తోను అభిమానులను అలరిస్తుంటుంది. అప్పుడప్పుడు ప్రత్యేక గీతాల్లో తళుక్కున మెరిసి యువత గుండెలను కొల్లగొడుతుంటుంది. గత కొంత కాలంగా ఆమె విక్కీ కౌశల్‌తో డేటింగ్ చేస్తుందని వదంతులు షికార్లు చేస్తున్నాయి. డిసెంబరు మొదటి వారంలో రాజస్థాన్‌లోని 800ఏళ్ల చరిత్ర కలిగిన ఒక కోటలో వీరి వివాహం జరగబోతుందని బీ టౌన్ టాక్. ఈ నేపథ్యంలో కత్రినా కైఫ్ ఆస్తులపై ఓ లుక్కేద్దాం. ఆమె సంపాదించిన ఆస్తి పాస్తుల వివరాలు తెలిస్తే ఎవరైనా సరే అవాక్కవాల్సిందే. 


ఆన్‌లైన్ వేదికగా బ్యూటీ ఉత్పత్తులను విక్రయించే సంస్థ నైకా. ఆ సంస్థలో ఆమె తన సొంత బ్రాండ్‌ ‘‘కే బ్యూటీ’’ని లాంచ్ చేసింది. ఆ సంస్థలో 2018లో ఆమె రూ.2.04కోట్లను ఇన్వెస్ట్ చేసింది. నవంబర్ 12 నాటికి ఆ షేర్ల విలువ రూ.22కోట్లకు చేరుకుంది. ఫోర్బ్స్ 2019లో విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం భారత్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే వ్యక్తుల్లో ఆమె 23వ స్థానంలో నిలిచింది. కత్రినా కైఫ్ ఆస్తుల విలువ నికరంగా రూ.210కోట్లుగా ఉంటుందని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.  ప్రతి ఏడాది ఆమె ఆస్తుల విలువ 8శాతం నుంచి 9శాతం వరకు పెరుగుతోంది. ఏదైనా బ్రాండ్‌కు ప్రచారం చేయాలంటే రూ. 50 లక్షల నుంచి రూ.60లక్షల వరకు పారితోషికంగా ఆమె తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రతి నెలా వివిధ మార్గాల ద్వారా ఆమె రూ.80లక్షలు సంపాదిస్తోంది. ప్రతి ఏడాది దాదాపుగా రూ.10కోట్లు సంపాదిస్తున్నట్టు సమాచారం.  


కత్రినా కైఫ్‌కు ఎస్‌యూవీ( స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్)లు అంటే చాలా ఇష్టం. అందువల్ల రూ.2.37కోట్ల విలువైన లాండ్ రోవర్ కారును ఆమె సొంతం చేసుకుంది. ఆడి క్యూ-7 కారు కూడా ఆమె దగ్గర ఉంది. ఈ కారు విలువ రూ.80లక్షలు ఉంటుంది.  రూ.50లక్షల విలువైన మెర్సిడెస్ ఎమ్ఎల్ 350ని కూడా ఆమె కొనుగోలు చేసింది. కత్రినా కైఫ్‌కు లండన్‌లో ఒక ఇల్లు ఉంది. ఈ ఇంటి విలువ దాదాపుగా రూ.7కోట్లు ఉంటుంది. ఆమె కుటుంబం మొత్తం ఇక్కడే నివసిస్తుంటుంది. ముంబయిలో అంధేరి వెస్ట్‌లో ఉన్న మౌర్య హౌస్‌లో ఆమెకు  సొంత ఇల్లు ఉంది. ఆ ఇంటి విలువ దాదాపుగా రూ.45కోట్లు ఉంటుంది.

Updated Date - 2021-11-12T23:06:11+05:30 IST