అసలు ఎవరీ Leena Manimekalai.. తల్లిదండ్రులు నో చెప్పినా ముందుకే.. Kaali కి ముందు కాంట్రవర్సీల లిస్ట్ ఇదీ..!

ABN , First Publish Date - 2022-07-05T22:30:00+05:30 IST

హిందువుల మనోభావాలను కించపరిచారంటూ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ లీనా మణిమేకలై (Leena Manimekalai)‌కు వ్యతిరేకంగా ఢిల్లీ పోలీసులు కేసును నమోదు చేశారు. ‘కాళీ’(Kaali) టైటిల్‌తో లీనా సోషల్

అసలు ఎవరీ Leena Manimekalai.. తల్లిదండ్రులు నో చెప్పినా ముందుకే.. Kaali కి ముందు కాంట్రవర్సీల లిస్ట్ ఇదీ..!

హిందువుల మనోభావాలను కించపరిచారంటూ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ లీనా మణిమేకలై (Leena Manimekalai)‌కు వ్యతిరేకంగా ఢిల్లీ పోలీసులు కేసును నమోదు చేశారు. ‘కాళీ’(Kaali) టైటిల్‌తో లీనా సోషల్ మీడియాలో ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. కాళీ మాత సిగరెట్ తాగుతున్నట్టు ఆ పోస్టర్ ఉంది. వెనుక భాగంలో ఎల్‌జీబీ‌టీ (LGBT) కమ్యూనిటీకి చెందిన జెండా ఉంది. దీంతో ఆమెకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని అనేక హిందూ సంస్థలు కోరుతున్నాయి. ఈ క్రమంలో అసలు ఎవరీ లీనా మణిమేకలై అని నెటిజన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు. 


లీనా మణిమేకలై మధురైలో జన్మించింది. కెనడాలోని టోరెంటోలో నివాసముంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. దేవదాసీ వ్యవస్థపై ‘మాతమ్మ’ (Mathamma) డాక్యుమెంటరీని నిర్మించింది. తల్లిదండ్రులు, అరుంధతియార్ సంఘం వ్యతిరేకించినప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు. దళిత మహిళలపై హింసకు వ్యతిరేకంగా మరో డాక్యుమెంటరీ ‘పరాయ్’ (Parai)ని రూపొందించింది. ఈ డాక్యుమెంటరీతో కూడా తీవ్ర విమర్శలపాలైంది. అనంతరం 2011లో ‘సెంగడల్’ (Sengadal) సినిమాను నిర్మించింది. ఇండియా, శ్రీలంకల మధ్య చిక్కుకుపోయిన ఓ మత్స్యకారుడి ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘సెంగడల్’ ను ప్రాంతీయ సెన్సార్ బోర్డు బ్యాన్ చేసింది. అయినప్పటికీ ఆమె వెనుకడుగు వేయలేదు. ఫిలిం అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ట్రిబ్యునల్ అనుమతించడంతో ఈ చిత్రాన్ని విడుదల చేసింది. లీనా మణిమేకలై తాజాగా ‘కాళీ’ డాక్యుమెంటరీతో  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టోరెంటోలోని అగా ఖాన్ మ్యూజియం ‘రిథమ్స్ ఆఫ్ కెనడా’ విభాగంలో ఈ చిత్రం భాగమని ట్విట్టర్‌లో ఆమె పేర్కొంది. ‘కాళీ’ పోస్టర్‌ను విడుదల చేయగానే.. అరెస్ట్‌ లీనా ‌మణిమేకలై (ArrestLeenaManimekal) అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ కావడం మొదలైంది. చాలా మంది నెటిజన్స్ ఆమెకు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. దీంతో లీనా స్పందించింది. ‘‘నాకు పోయేదేమి లేదు. నమ్మినా విషయాన్ని బతికి ఉన్నంత వరకూ ధైర్యంగా చెబుతాను. ఒక వేళ నా ప్రాణాల్ని మూల్యంగా చెల్లించాల్సి వస్తే అందుకు నేను సిద్ధం’’ అని లీనా మేఖలై వెల్లడించింది.

Updated Date - 2022-07-05T22:30:00+05:30 IST