Vikram సినిమాలో క్లైమాక్స్‌లో 5 నిమిషాల ఒక్క సీన్ కోసం Suriya ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-06-06T21:01:45+05:30 IST

బాక్సాఫీస్ హిట్ లతో సంబంధం లేకుండా ప్రయోగాలు చేసే నటుడు కమల్ హాసన్ (Kamal Haasan). ఆయన తాజాగా నటించిన చిత్రం ‘విక్రమ్’ (Vikram). యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. స్టార్ డైరెక్టర్ లోకేష్

Vikram సినిమాలో క్లైమాక్స్‌లో 5 నిమిషాల ఒక్క సీన్ కోసం Suriya ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా ప్రయోగాలు చేసే నటుడు కమల్ హాసన్ (Kamal Haasan). ఆయన తాజాగా నటించిన చిత్రం ‘విక్రమ్’ (Vikram). యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించారు. ‘విక్రమ్’ ను పాన్ ఇండియాగా రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న పలు భాషల్లో ఈ మూవీ విడుదల అయింది. ఈ చిత్రంలో స్టార్ హీరోలు విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) కీలక పాత్రలు పోషించారు. సూర్య (Suriya) అతిథి పాత్రలో మెరిశారు. ఈ సినిమా విడుదలైన నాటి నుంచి విమర్శకుల ప్రశంసలతో పాటు అభిమానుల మన్ననలు దక్కించుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతుంది. 


సూర్య‌కు కమల్ హాసన్‌తో నటించాలని కోరిక. అందుకే స్టార్ హీరో అయినప్పటికీ ‘విక్రమ్’ సినిమాలో ఒక్క సీన్‌లో 5నిమిషాల పాటు కనిపించారు. ఈ చిత్రంలో నటించడానికి సూర్య ఎటువంటి పారితోషికం తీసుకోలేదు. కమల్ మీద గౌరవంతోనే రెమ్యూనరేషన్ వద్దని చెప్పారు. అలాగే ‘విక్రమ్-3’ లో కమల్ హాసన్ పక్కన విలన్‌గా నటించడానికి కూడా అంగీకరించారు. ‘విక్రమ్’ సినిమాలో ఉచితంగా నటించినప్పటికి ‘విక్రమ్-3’ కోసం భారీస్థాయిలో పారితోషికం తీసుకొబోతున్నాడని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. ‘విక్రమ్-3’ సినిమా షూటింగ్ 2023 జూన్ తర్వాత ప్రారంభం కాబోతుంది. 

Updated Date - 2022-06-06T21:01:45+05:30 IST