‘డిజె టిల్లు’ సీక్వెల్‌కి కూడా హీరో అతనే: నిర్మాత

ABN , First Publish Date - 2022-02-13T02:04:14+05:30 IST

సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘డిజె టిల్లు’. ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించింది. డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని

‘డిజె టిల్లు’ సీక్వెల్‌కి కూడా హీరో అతనే: నిర్మాత

సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘డిజె టిల్లు’. ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించింది. డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, విడుదలైన అన్ని చోట్లా మంచి టాక్‌తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా తమ విజయానందాన్ని మీడియాతో పంచుకున్నారు చిత్ర నిర్మాత, హీరో, దర్శకుడు.


ఈ సందర్భంగా హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ‘‘నేను ఇప్పటి వరకు బ్లాక్‌బస్టర్ అనే మాట వినలేదు. ఇప్పుడు డిజె టిల్లుతో వింటున్నా. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఇవాళ తెలిసింది. చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మేము థియేటర్‌లో 10శాతం వర్కవుట్ అవుతాయి అని అనుకున్న సీన్స్.. అంతకు మించి స్పందనను రాబట్టుకుంటున్నాయి. థమన్‌గారి నేపథ్య సంగీతం సన్నివేశాలకు మరింత బలాన్ని ఇచ్చింది. నేను ఇక్కడి వాడినే అందుకే ఆ బాడీ లాంగ్వేజ్, మాటతీరు అన్నీ సహజంగా వచ్చాయి. స్వయంగా రాసుకున్న డైలాగ్స్ కాబట్టి సులువుగా డిజె టిల్లులా మాట్లాడగలిగా. ఇందాకే త్రివిక్రమ్ గారిని కలిసి వచ్చాం. ఆయన స్క్రిప్టు చూసి ముందే ఏది ఎక్కడ పేలుతుందో చెప్పేశారు. ఇది ఆయనకు సినిమా మీదున్న అవగాహనకు నిదర్శనం. ఆయన పరిచయం మా అదృష్టం. నిర్మాతకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు..’’ అని తెలపగా దర్శకుడు విమల్ కృష్ణ మాట్లాడుతూ.. ఇవాళ థియేటర్లలో ప్రేక్షకుల సందడి చూసి.. డిజె టిల్లుకు మేము ఇంత క్రేజ్ సృష్టించామా అని అనిపించింది. సినిమాలో సంభాషణలకు వస్తున్న స్పందన, ఈ క్రెడిట్ అంతా నేను సిద్ధుకు ఇస్తాను. నిర్మాత నాగవంశీగారి నమ్మకం, మా కష్టం అంతా ఇవాళ ఈ విజయానికి కారణం. ఈ విజయాన్ని ఎంతగానో ఆస్వాదిస్తున్నాను’’ అన్నారు.


నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ‘‘డిజె టిల్లు కథ విన్నప్పుడే ఈ రకమైన స్పందన ప్రేక్షకుల నుంచి వస్తుందని ఊహించాం. ఇవాళ మా అంచనా నిజమైంది. సినిమా విజయం సాధిస్తుందని తెలుసు. ఊహించిన దానికంటే పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇలాంటి చిత్రాలతో సక్సెస్ అందుకున్నప్పుడే రిస్క్ చేయాలనే ధైర్యం కలుగుతుంది. ఇంకా కొత్త వాళ్లను ప్రోత్సహించాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు చిన్న సినిమా ఎందుకు చేస్తున్నారని గతంలో అడిగారు. ఇలాంటి ప్రాజెక్టులే ఎక్కువ సంతృప్తినిస్తాయి. ఏ స్థాయి సినిమా చేసినా మా సంస్థకున్న పేరును కాపాడుకోవాలి. రేపు భీమ్లా నాయక్ వస్తోంది. అది చూసిన వాళ్ళు డిజె టిల్లును ఏదో చుట్టేశారు అనుకోకూడదు. ఏ సినిమా అయినా మా సంస్థ గౌరవాన్ని నిలబెట్టేలా ఉండాలి. మేము అలాగే ప్లాన్ చేసుకుంటాం. డిజె టిల్లు సీక్వెల్‌ కూడా సిద్ధు హీరోగా త్వరలోనే ప్రారంభిస్తాం..’’ అని తెలిపారు.

Updated Date - 2022-02-13T02:04:14+05:30 IST