యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), స్నేహా శెట్టి (Sneha Shetty) జంటగా కొత్త దర్శకుడు విమల్ కృష్ణ (Vimal Krishna) తెరకెక్కించిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘డిజే టిల్లు’ (DJ Tillu). సితారా ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Nagavamshi) నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. సిద్దూ జొన్నలగడ్డ నటనకి మంచి పేరొచ్చింది. అలాగే. పాటలు కూడా యూత్ కు బాగా కనెక్ట్ అయ్యాయి.
ఈ సినిమా తెచ్చిపెట్టిన సూపర్ క్రేజ్ తో సిద్దూ జొన్నలగడ్డ టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్నాడు. ఇటీవల ‘డీజే టిల్లు’ సీక్వెల్‌ను అనౌన్స్ చేశారు నిర్మాతలు. మొదటి భాగానికి కథ, మాటలు రాసిన సిద్ధూనే రెండో భాగం రచనకు కూడా పూనుకుంటున్నాడు. అయితే సీక్వెల్ లో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయని టాక్స్ బలంగా వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఈ సినిమాను విమల్ కృష్ణ డైరెక్ట్ చేయడంలేదట. అతడికి వేరే కమిట్‌మెంట్స్ ఉండడం వల్ల హీరో సిద్ధూ జొన్నలగడ్డనే ఆ బాధ్యతను కూడా చేపట్టబోతున్నాడట. పూర్తి డెక్కన్ స్లాంగ్‌లో ఈ సినిమాలోని డైలాగ్స్ రాసుకున్న సిద్ధూ.. రెండో భాగంలో కూడా అదే కంటిన్యూ చేయబోతున్నాడు. ఒకమ్మాయితో ప్రేమలో పడ్డ హీరో.. కథానాయిక చేసిన హత్యలో అనుకోకుండా ఇరుక్కుంటాడు. ఆ డెడ్ బాడీని మాయం చేసిన అతడికి.. ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? అన్నదే మిగతా కథ. థ్రిల్లర్ కథాంశం అయినప్పటికీ.. కామెడీ ప్లస్ ఇంటెన్సిటీని బాగా క్రియేట్ చేయగలిగాడు దర్శకుడు. రెండో భాగానికి కూడా ఇదే మ్యాజిక్ ను అప్లై చేయబోతున్నారు. ఈ భాగాన్ని కూడా సితారా ఎంటర్ టైన్ మెంట్స్ వారే నిర్మించబోతున్నారు. ఆగస్ట్ లో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళనున్న ‘డిజే టిల్లు 2’ చిత్రం మొదటి భాగాన్ని మించి సక్సెస్ అవుతుందేమో చూడాలి.