Mirzapur fame Divyenndu Sharma: కార్తీక్ ఆర్యన్‌కి నటించడం నేర్పానంటున్న దివ్యేందు

ABN , First Publish Date - 2022-08-04T14:46:31+05:30 IST

‘ప్యార్ కా పంచ్‌నామా’ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన నటుడు దివ్యేందు శర్మ. ప్రముఖ దర్శకుడు లవ్ రంజన్ డైరెక్షన్‌లో...

Mirzapur fame Divyenndu Sharma: కార్తీక్ ఆర్యన్‌కి నటించడం నేర్పానంటున్న దివ్యేందు

‘ప్యార్ కా పంచ్‌నామా’ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన నటుడు దివ్యేందు శర్మ(Divyenndu Sharma). ప్రముఖ దర్శకుడు లవ్ రంజన్ (Luv Ranjan) డైరెక్షన్‌లో 2011లో వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించడంతో.. మొదటి సినిమాతోనే ఈ నటుడికి మంచి పేరు వచ్చింది. ఇటీవల వచ్చిన వెబ్‌సిరీస్‌ ‘మీర్జాపూర్’లో చేసిన మున్నా క్యారెక్టర్‌తో అయితే దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ వచ్చింది. కాగా.. దివ్యేందు మొదటి సినిమా ‘ప్యార్ కా పంచ్‌నామా(Pyaar Ka Punchnama)’లో యువ నటుడు కార్తీక్ ఆర్యన్‌ (Kartik Aaryan) కూడా నటించాడు. ఆయనకి ఈ మూవీనే మొదటి సినిమా. ఈ సినిమాలో ఈ ఇద్దరి నటనకి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం గురించి ఓ ఇంటర్య్వూలో దివ్యేందు మాట్లాడుతూ.. కార్తీక్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.


దివ్యేందు మాట్లాడుతూ.. ‘కార్తీక్‌కి ఇదే మొదటి సినిమా. అప్పుడే ఇంజనీరింగ్ పూర్తి చేసి వచ్చాడు. అతనికి నటన గురించి అంతగా తెలియదు. దీంతో నటనలో మెళకువలను నేనే నేర్పించాను. అప్పుడు అతను చాలా సంతోషపడ్డాను. నాకు అతన్ని చూసి మంచి అనుభూతి కలిగింది’ అని చెప్పుకొచ్చాడు.


అలాగే.. ‘ప్యార్ కా పంచ్‌నామా 2’లో ఎందుకు నటించలేదని అడగగా.. ‘ఇంతకుముందు చేసిన పాత్రనే మళ్లీ చేయాలని అనిపించలేదు. అంతేకాకుండా.. మొదటి భాగంలోనే లిక్విడ్‌కి నేను ఇవ్వగలిగినదంతా ఇచ్చాను. అందుకే రెండో పార్టులో నటించలేదు’ అని దివ్యేందు తెలిపాడు.


అలాగే.. ‘ఎక్కడికి వెళ్లిన మీర్జాపూర్‌లో మున్నాగా నన్ను గుర్తుపెట్టుకొని ప్రశంసించడం ఆనందంగా ఉంది. అది చాలా సీరియస్ పాత్ర. కానీ.. భవిష్యత్తులో కామెడీ రోల్స్ చేయాలనుకుంటున్నా’ అని దివ్యేందు చెప్పాడు. కాగా ‘మీర్జాపూర్’ సీజన్ 2 విడుదలైన తర్వాత దివ్యేందు ‘1800 లైఫ్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించాడు.

Updated Date - 2022-08-04T14:46:31+05:30 IST