దీపికతో విడాకులు... రణ్‌వీర్‌ ఏమన్నారంటే..?

ABN , First Publish Date - 2022-09-30T11:52:28+05:30 IST

‘రణ్‌వీర్‌ సింగ్‌ - దీపికా పదుకొణె జంట విడిపోతోందా? త్వరలో విడాకులు తీసుకొంటున్నారా?’ రెండు రోజుల నుంచీ బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న వార్త ఇది...

దీపికతో విడాకులు... రణ్‌వీర్‌ ఏమన్నారంటే..?

‘రణ్‌వీర్‌ సింగ్‌ - దీపికా పదుకొణె జంట విడిపోతోందా? త్వరలో విడాకులు తీసుకొంటున్నారా?’ రెండు రోజుల నుంచీ బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న వార్త ఇది. బాలీవుడ్‌ మీడియా అంతా ఈ జంట విడాకుల గురించి రకరకాల కథనాలు వండి వారుస్తోంది. ఈ వదంతుల్ని పరోక్షంగా తిప్పి కొట్టారు రణ్‌వీర్‌. ఓ కార్యక్రమంలో రణవీర్‌ మాట్లాడుతూ ‘‘2012లో మేమిద్దరం ప్రేమలో పడ్డాం. ఇది 2022. అంటే మా ప్రేమకు పదేళ్లు. ఈ ప్రయాణంలో దీపికపై మరింత ప్రేమ, గౌరవం పెరిగాయి. తన నుంచి నేను చాలా విషయాలు నేర్చుకొన్నా. మీ అందరికీ త్వరలోనే ఓ సర్‌ప్రైజ్‌ ఉండబోతోంది. మరోసారి మమ్మల్ని జంటగా చూడబోతున్నార’’ంటూ దీపిక పై తన ప్రేమని బయటపెట్టారు రణ్‌వీర్‌. జీవితంలో తనకు దొరికిన అపురూపమైన కానుక దీపిక అని, ఈ విషయంలో తానెంతో అదృష్టవంతుడని పొంగిపోయారు రణ్‌వీర్‌. సో.. ఈ విడాకుల వార్త ఉత్తిదే అన్నమాట.  


Updated Date - 2022-09-30T11:52:28+05:30 IST