The Little Mermaid: డిస్నీ సినిమాపై ఫ్యాన్స్ వ్యతిరేకత

ABN , First Publish Date - 2022-09-18T00:00:08+05:30 IST

హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ డిస్నీ రూపొందించిన మూవీ ‘ద లిటిల్ మర్‌మెయిడ్’ (The Little Mermaid). ఈ సినిమా 1989లో విడుదలై సంచలన విజయం సాధించింది. తాజాగా ఈ సినిమాను డిస్నీ రీమేక్ చేస్తుంది.

The Little Mermaid: డిస్నీ సినిమాపై ఫ్యాన్స్ వ్యతిరేకత

హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ డిస్నీ రూపొందించిన మూవీ ‘ద లిటిల్ మర్‌మెయిడ్’ (The Little Mermaid). ఈ సినిమా 1989లో విడుదలై సంచలన విజయం సాధించింది. తాజాగా ఈ సినిమాను డిస్నీ రీమేక్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది మే 26న విడుదల చేయనుంది. రాబ్ మార్షల్ (Rob Marshall) దర్శకత్వం వహిస్తున్నాడు. సింగర్ హల్లె బైలీ (Halle Bailey) ఈ సినిమాలో ఎరియల్‌గా నటించనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అప్పటి నుంచి ఈ మూవీని వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. 


డిస్నీ సినిమాలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ, హిట్ సినిమాలను రీమేక్ చేస్తుండటంతో ఎదరుదెబ్బలు తింటుంది. శ్వేత జాతీయేతర నటిని టైటిల్ రోల్‌కు ఎంపిక చేయడం కొంత మంది జాత్యహంకార చర్యగా అభివర్ణిస్తున్నారు. జలకన్య పాత్రకు ఆమె సరిపోదని పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగానే కొంత మంది తమ వ్యతిరేకతను చూపించడం మొదలుపెట్టారు. యూట్యూబ్‌లో డిస్‌లైక్స్‌ను కొట్టడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 1.5మిలియన్ డిస్‌లైక్స్ వచ్చాయి. దీంతో యూట్యూబ్ డిస్‌లైక్స్‌ను కనిపించకుండా చేసింది. కామెంట్స్ సెక్షన్‌లో కొంత మంది పరుష పదజాలాన్ని వాడారు. దూషించడం మొదలుపెట్టారు. 


సినిమాలను డిస్నీ అనేక సందర్భాల్లో రీమేక్ చేసి సక్సెస్ అయింది. కంటెంట్, పాత్రలను మార్చినప్పటికి ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి. ప్రస్తుతం ఆ ప్రొడక్షన్ హౌస్ 1990ల నాటి అనేక సినిమాలను రీమేక్ చేస్తుంది. ఈ మూవీస్ ద్వారానే బిలియన్స్‌ను సంపాదిస్తుంది. కానీ, డిస్నీ అనేక సార్లు విమర్శలను ఎదుర్కొంది. శ్వేత, శ్వేత జాతీయేతర వంటి టాపిక్స్‌పై చర్చకు అవకాశమిచ్చింది. 




Updated Date - 2022-09-18T00:00:08+05:30 IST