బోల్డ్‌గా ‘‘ లోఫర్ ’’ హీరోయిన్ దిశా పటానీ.. ఫొటో వైరల్..

ABN , First Publish Date - 2022-01-09T22:31:30+05:30 IST

తన అందంతో కుర్రకారు గుండెలను కొల్లగొట్టిన నటి దిశా పటానీ. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘‘ లోఫర్ ’’ చిత్రంలో నటించి టాలీవుడ్

బోల్డ్‌గా ‘‘ లోఫర్ ’’ హీరోయిన్ దిశా పటానీ.. ఫొటో వైరల్..

తన అందంతో కుర్రకారు గుండెలను కొల్లగొట్టిన నటి దిశా పటానీ. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘‘ లోఫర్ ’’ చిత్రంలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువయింది. ఆ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. దిశ గత కొంతకాలంగా టైగర్ ష్రాఫ్‌తో డేటింగ్ చేస్తుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. ఆమె ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌కు దాదాపుగా 5కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. తన ఫొటోలను ఇన్‌స్టాగ్రాం వేదికగా షేర్ చేస్తూ అభిమానులకు ఎప్పుడు టచ్ లో ఉంటుంది. 


తాజాగా దిశ ఒక ఫొటోను అభిమానులతో పంచుకుంది. ఆ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. దీంతో అభిమానులు ఆ ఫొటోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఆ ఫొటోలో ఆమె బోల్డ్‌గా కనిపించింది.  బికినీలో వెనుక వైపు నుంచి ఆ ఫొటోను తీసుకుంది. ఆ ఫొటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ఆమె ‘‘ హీరోపంటీ-2 ’’ సినిమాలో నటిస్తుంది. టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్నారు. తార సుతారియా, నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.



Updated Date - 2022-01-09T22:31:30+05:30 IST