Disha Patani: నా కల నెరవేరలేదు..

ABN , First Publish Date - 2022-06-07T15:25:49+05:30 IST

'నా కల నెరవేరలేదు'..అంటోంది బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ (Disha Patani). పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ (Lofer) సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైంది.

Disha Patani: నా కల నెరవేరలేదు..

'నా కల నెరవేరలేదు'..అంటోంది బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ (Disha Patani). పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ (Lofer) సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా నటించాడు. ప్రస్తుతం హిందీ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్‌గా కొనసాగుతున్న దిశా ఇటీవల ఇచ్చిన ఓ మీడియా ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దిశా పటానీ హీరోయిన్ అవుతుందని అనుకోలేదట. 


తన డ్రీమ్ పైలెట్ అని..దానికోసమే కలలు కన్నట్టు చెప్పుకొచ్చింది. కానీ, డబ్బుల అవసరం కోసం మోడలింగ్ చేశాను.. అని దిశా పటానీ తెలిపింది. ఈ క్రమంలో ఎన్నో బ్రాండ్స్‌కు సంబంధించిన కమర్షియల్స్ యాడ్స్‌లో నటించిందట. ఆ సమయంలోనే పూరి జగన్నాథ్ లోఫర్ సినిమా కోసం హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారని వెల్లడించిది. వచ్చిన అవకాశంను ఎందుకు కాదనుకోవాలి.. అనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను కమిట్ అయ్యిందట. 


అయితే, లోఫర్ మూవీ ఫ్లాప్ కావడంతో ఇక మళ్ళీ హీరోయిన్ ఛాన్సెస్ రావనుకున్న దిశా, మళ్ళీ మోడలింగ్‌పైనే దృష్ఠి సారించిందట. కానీ, అనుకోకుండా మరోసారి సినిమా చేసే అవకాశం, అది కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో రావడంతో 'ధోని'లో నటించాను అని చెప్పింది. ఈ సినిమా భారీ హిట్ సొంతం చేసుకోవడంతో ఆ తర్వాత వరుసగా సినిమాల్లో ఆఫర్లు రావడం క్రేజీ హీరోయిన్‌గా పాపులర్ అవడం జరిగాయి. కొన్ని సినిమాలు చేసి మళ్ళీ నా డ్రీమ్ పైలెట్ అయ్యేందుకు వెళ్ళాలనుకున్నాను. కానీ, ఇప్పటివరకు అది నెరవేరనే లేదు అని చెప్పుకొచ్చింది దిశా పటానీ. 

Updated Date - 2022-06-07T15:25:49+05:30 IST