‘‘నాకు చిన్న పిల్లలతో డేటింగ్ ఎలా చేయాలో తెలియదు’’
ABN , First Publish Date - 2022-01-14T03:26:43+05:30 IST
‘‘నాకు చిన్న పిల్లలతో డేటింగ్ ఎలా చేయాలో తెలియదు!’’ అంటోంది డ్రూ బ్యారీ మోర్. అయితే ఈ హాలీవుడ్ సీనియర్ బ్యూటీ మాట్లాడుతోంది రొమాంటిక్ డేట్ గురించి కాదు. ఆమె ఒక తల్లిగా తన పిల్లల గురించి చెబుతోంది. తనకు తన కిడ్స్‌తో డేటింగ్ చేయటం రావటం లేదని మనసులో బాధని బయటపెట్టేసింది!

డ్రూ బ్యారీ మోర్ సింగిల్ మదర్. ఆమెకు మాజీ భర్త విల్ కోపెల్‌మ్యాన్‌తో ఇద్దరు పిల్లలున్నారు. కానీ, భార్యాభర్తలు విడిపోవటంతో ప్రస్తుతం సంతానం బాధ్యత డ్రూ మీదే పడింది. ‘‘నా పిల్లల తండ్రి ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన స్త్రీని పెళ్లాడి సంతోషంగా ఉన్నాడు. కానీ నేను... నాకు ఇంట్లోకి కొత్త వార్ని తీసుకొచ్చే ఉద్దేశం లేదు’’ అంది మిస్ బ్యారీ మోర్.
హాలీవుడ్ కపుల్స్ విడిపోవటం మరీ ఆశ్చర్యకర విషయమేమీ కాదు. అయితే, తల్లిదండ్రులు విడిపోయాక పిల్లల పరిస్థితే చాలా సార్లు ఇబ్బందికరంగా మారుతుంటుంది. ప్రస్తుతం డ్రూ బ్యారీ మోర్ బిడ్డలు కూడా అదే స్థితిలో ఉన్నారు. హాలీవుడ్ మామ్ తన పిల్లల కోసం మరో పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉన్నప్పటికీ తగినంత సమర్థంగా పెంచలేకపోతున్నానని మాత్రం ఆమె ఫీలవుతోంది...