Geetha: వినాయక్ శిష్యుడి ‘గీత’ విడుదలకు రెడీ!

ABN , First Publish Date - 2022-08-14T22:34:25+05:30 IST

సంచలన దర్శకుడు వి.వి.వినాయక్ (VV Vinayak) ప్రియశిష్యుడు విశ్వ(viswa)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. గ్రాండ్ మూవీస్ పతాకంపై ఆర్.రాచయ్య (R Rachaiah) నిర్మించిన విభిన్న కథాచిత్రం ‘గీత’ (Geetha). ‘మ్యూట్ విట్నెస్’ అనేది

Geetha: వినాయక్ శిష్యుడి ‘గీత’ విడుదలకు రెడీ!

సంచలన దర్శకుడు వి.వి.వినాయక్ (VV Vinayak) ప్రియశిష్యుడు విశ్వ(viswa)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. గ్రాండ్ మూవీస్ పతాకంపై ఆర్.రాచయ్య (R Rachaiah) నిర్మించిన విభిన్న కథాచిత్రం ‘గీత’ (Geetha). ‘మ్యూట్ విట్నెస్’ అనేది ఉపశీర్షిక. వి.వి. వినాయక్ ఆశీస్సులతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్లుగా తెలుపుతూ.. చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. క్రేజీ కథానాయిక హెబ్బా పటేల్ (Hebah Patel) టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో సునీల్ (Sunil) ముఖ్యపాత్ర పోషించగా.. ‘నువ్వే కావాలి, ప్రేమించు’ వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సాయి కిరణ్ (Sai Kiran) విలన్‌గా కనిపించనున్నారు. 


ఈ సందర్భంగా దర్శకుడు విశ్వ మాట్లాడుతూ.. ఈ సినిమా అవకాశం నా గురువు, దైవమైన వినాయక్‌గారే ఇప్పించారు. నిర్మాత రాచయ్యగారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలుపగా.. నిర్మాత ఆర్.రాచయ్య మాట్లాడుతూ.. ‘‘గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా మా డైరెక్టర్ విశ్వ.. ఈ ‘గీత’ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 26న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’’ అన్నారు. కాగా.. రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి (30 ఇయర్స్), తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం, ఎస్. చిన్నా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. 

Updated Date - 2022-08-14T22:34:25+05:30 IST