అదే మా వజ్ర సంకల్పం అంటోన్న Itlu Amma చిత్ర దర్శకుడు

Twitter IconWatsapp IconFacebook Icon

మమ్ముట్టి-సుమన్-నగ్మా-మాలాశ్రీలతో ‘సూర్యపుత్రులు’ (SuryaPuthrulu), అరవింద్ సామి-నగ్మాలతో ‘మౌనం’ (Mounam), జగపతిబాబు-హీరాలతో ‘శ్రీకారం’ (Sreekaram) వంటి సినిమాలను రూపొందించి... దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు సీనియర్ దర్శకులు సి. ఉమామహేశ్వరరావు (C Uma Maheswara Rao). జాతీయ స్థాయి ఉత్తమ నటి రేవతి (Revathi)తో ముప్పై ఏళ్ల క్రితం ‘అంకురం’ (Ankuram) సినిమాని రూపొందించి, రివార్డులతోపాటు అవార్డులు కొల్లగొట్టిన ఆయన.. రీసెంట్‌గా రేవతితోనే ‘ఇట్లు అమ్మ’ (Itlu Amma) చిత్రాన్ని రూపొందించి.. మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ చేశారు. ‘ఇట్లు అమ్మ’ చిత్రం జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో 76 అవార్డులు గెలుచుకుని.. ప్రస్తుతం సోని లివ్‌లో ప్రదర్శితమవుతోంది. అయితే దర్శకుడు సి.ఉమామహేశ్వరరావు సినిమాలతో బిజీగా ఉంటూనే.. గత ఐదేళ్లుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్’ (Dadasaheb Phalke School of Film Studies)  అనే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నిర్వహిస్తున్నారు.

 

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, కళాతపస్వి కె. విశ్వనాధ్ (K Viswanath) చేతుల మీదుగా మొదలైన ‘దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్’.. అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్ (Allu Aravind), దిల్ రాజు (Dil Raju) వంటి చిత్ర ప్రముఖుల ప్రోత్సాహంతో విజయవంతంగా నడుస్తూ.. తెలుగు చిత్రసీమకు గత ఐదేళ్లుగా ఎందరో ప్రతిభావంతుల్ని పరిచయం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో... దిగువ మధ్య తరగతివారికి సైతం అందుబాటులో అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌గా పేరు గడించింది. ‘అంతర్జాతీయ ప్రమాణాలు... అందరికీ అందుబాటులో ఫీజులు’ అనే సిద్ధాంతంతో ప్రగతిపథంలో దూసుకుపోతున్న  ఈ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ మరికొద్ది రోజుల్లో 5 వ వార్షికోత్సవం జరుపుకోనున్న సందర్భంగా ఉమామహేశ్వరరావు.. ఈ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ గురించి కొన్ని విషయాలను మీడియాకు తెలిపారు. 

అదే మా వజ్ర సంకల్పం అంటోన్న Itlu Amma చిత్ర దర్శకుడు

ఆయన మాట్లాడుతూ.. ‘‘ ‘యాక్టింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ’లకు మాత్రమే పరిమితం కాకుండా.. ఎడిటింగ్, స్క్రిప్ట్ రైటింగ్, ఆడియోగ్రఫీ, డిజిటల్ మ్యూజిక్ ప్రొడక్షన్ వంటి సౌండ్‌కి సంబంధించిన కోర్సులు సైతం ఉండడం మా ఫిల్మ్ స్కూల్ ప్రత్యేకత. ఇప్పటివరకు మా స్కూల్‌లో కోర్సులు చేసినవారంతా... ఇండస్ట్రీలో వివిధ శాఖల్లో విశేషంగా రాణిస్తున్నారు. నేషనల్, ఇంటర్నేషనల్, రీజినల్ సినిమాలపై సమగ్ర అవగాహన కలిగేలా సిలబస్ డిజైన్ చేశాం. మన దేశంలో ఉన్న బెస్ట్ ఫిల్మ్ స్కూల్స్ అనుసరించే సిలబస్ బాగా స్టడీ చేసి... వాటన్నిటిలో ఉన్న ఉత్తమ అంశాలు మేళవించి...మా ఫిల్మ్ స్కూల్ సిలబస్ రూపొందించాం. ఫిల్మ్ స్కూల్ కు సంబంధించి అల్లు అరవింద్, దిల్ రాజు వంటి అగ్ర నిర్మాతల సలహాలు-సూచనలు, సహాయ సహకారాలు మరువలేనివి. దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ, నీలకంఠ, ప్రముఖ నటులు నాజర్, రేవతి, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధు అంబట్, ఆస్కార్ విన్నర్ రసూల్ పూకుట్టి వంటి నిష్ణాతులు గెస్ట్ ఫ్యాకల్టీగా ఉన్న ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ను.. మన దేశంలోనే నంబర్ 1గా తీర్చిదిద్దాలనే వజ్ర సంకల్పంతో ముందుకు వెళుతున్నాం. పూర్తి వివరాల కోసం డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ.డిపిఎస్ఎఫ్ఎస్.ఈడియు.ఇన్ అనే వెబ్‌సైట్ చూడవచ్చు. ఇంకా, నా తదుపరి చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే అధికారికంగా పూర్తి వివరాలు ప్రకటిస్తాం..’’ అని తెలిపారు.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.