మ్యూజిక్ సిట్టింగ్స్‌లో Director Teja కొత్త చిత్రం

ABN , First Publish Date - 2022-06-22T03:57:32+05:30 IST

దర్శకుడు తేజ (Teja).. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎందరినో పరిచయం చేశారు. ఆయన పరిచయం చేసిన వారిలో అనూప్ రూబెన్స్ (Anup Rubens) కూడా ఒకరు. ‘జై’ సినిమాతో అనూప్ రూబెన్స్ సంగీత

మ్యూజిక్ సిట్టింగ్స్‌లో Director Teja కొత్త చిత్రం

దర్శకుడు తేజ (Teja).. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎందరినో పరిచయం చేశారు. ఆయన పరిచయం చేసిన వారిలో అనూప్ రూబెన్స్ (Anup Rubens) కూడా ఒకరు. ‘జై’ సినిమాతో అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడిగా ప్రయాణం మొదలెట్టారు. ఆ తర్వాత ఆయన నుండి ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ వచ్చాయి. మళ్లీ చాలా కాలం తర్వాత తేజ, అనూప్ రూబెన్స్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతోంది. వారిద్దరి కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమాకు సంబంధించి ప్రస్తుతం గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఈ విషయం తెలుపుతూ.. తాజాగా అనూప్ రూబెన్స్ ఓ పిక్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


ఈ పిక్‌లో దర్శకుడు తేజ, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, గేయ రచయిత చంద్రబోస్ (Chandrabose).. సంగీతానికి సంబంధించిన చర్చలు చేస్తున్నారు. వరల్డ్ మ్యూజిక్ డేని పురస్కరించుకుని.. సంగీత ప్రియులకు వీరు శుభాకాంక్షలు తెలిపారు. ఇక వీరి కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.



Updated Date - 2022-06-22T03:57:32+05:30 IST