రాజమౌళి సార్, మీకూ మాకూ ఒకటే తేడా!: సుకుమార్

ABN , First Publish Date - 2022-03-26T02:48:27+05:30 IST

‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై ఆయన ప్రత్యేకంగా తన ఫేస్‌బుక్ ఖాతాలో ఒక లెటర్ పోస్ట్ చేశారు. వాస్తవానికి సుకుమార్‌కి రాజమౌళి వీరాభిమాని. ఈ విషయం పలుమార్లు, పలు ఇంటర్వ్యూలలో రాజమౌళి తెలిపారు. రామ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జగడం’ సినిమాలోని ఓ షాట్‌కి..

రాజమౌళి సార్, మీకూ మాకూ ఒకటే తేడా!: సుకుమార్

‘రాజమౌళి సార్, మీకూ మాకూ ఒకటే తేడా.. ఇలాంటి సినిమా మీరు తీయగలరు.. మేం చూడగలం అంతే..’ అని అన్నారు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై ఆయన ప్రత్యేకంగా తన ఫేస్‌బుక్ ఖాతాలో ఒక లెటర్ పోస్ట్ చేశారు. వాస్తవానికి సుకుమార్‌కి రాజమౌళి వీరాభిమాని. ఈ విషయం పలుమార్లు, పలు ఇంటర్వ్యూలలో రాజమౌళి తెలిపారు. రామ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జగడం’ సినిమాలోని ఓ షాట్‌కి తను ఎప్పటికీ అభిమానిని అని రాజమౌళి చెబుతుంటారు. సుకుమార్ సినిమాలు విడుదలైనప్పుడు.. ప్రత్యేకంగా తనే కావాలని మరీ ఆయనని రాజమౌళి ఇంటర్వ్యూని చేస్తుంటారు. అలాంటిది.. ఇప్పుడు సుకుమార్ ఇలా రాసుకొచ్చారంటే.. నిజంగా విశేషమనే చెప్పుకోవాలి. 


‘‘మీరు పక్కనే వున్నా

మిమ్మల్ని అందుకోవాలంటే

పరిగెత్తాలి-


మేం ఆకాశంలో వున్నా

మిమ్మల్ని చూడాలంటే

తలెత్తాలి-


రాజమౌళి సార్,

మీకూ మాకూ ఒకటే తేడా.. 


ఇలాంటి సినిమా మీరు తీయగలరు

మేం చూడగలం అంతే-

-సుకుమార్’’ అని సుకుమార్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక దర్శకుడి గురించి మరో దర్శకుడు ఇలా స్పందించడానికి ఘట్స్ కావాలంటూ నెటిజన్లు సుకుమార్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.



Updated Date - 2022-03-26T02:48:27+05:30 IST