Die Hard Fan: ట్రైలర్ వదిలిన క్రియేటివ్ దర్శకుడు

ABN , First Publish Date - 2022-08-25T03:07:38+05:30 IST

శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రియాంక శ‌ర్మ‌, శివ ఆల‌పాటి, ష‌క‌ల‌క శంక‌ర్‌, రాజీవ్ క‌న‌కాల‌, నోయ‌ల్ నటీనటులుగా అభిరామ్ ఎమ్. దర్శకత్వంలో చంద్రప్రియ సుబుధి నిర్మిస్తున్న చిత్రం ‘డై హార్డ్ ఫ్యాన్’ (Die Hard Fan). ఈ చిత్రంలో

Die Hard Fan: ట్రైలర్ వదిలిన క్రియేటివ్ దర్శకుడు

శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రియాంక శ‌ర్మ‌, శివ ఆల‌పాటి, ష‌క‌ల‌క శంక‌ర్‌, రాజీవ్ క‌న‌కాల‌, నోయ‌ల్ నటీనటులుగా అభిరామ్ ఎమ్. దర్శకత్వంలో చంద్రప్రియ సుబుధి నిర్మిస్తున్న చిత్రం ‘డై హార్డ్ ఫ్యాన్’ (Die Hard Fan). ఈ చిత్రంలో హీరోయిన్‌‌కి డైహ‌ర్ట్ ఫ్యాన్‌గా శివ ఆల‌పాటి (Shiva Alapati) న‌టిస్తున్నాడు. సినిమాలో న‌టించే హీరోయిన్స్ అంటే యూత్‌లో ఎంత క్రేజ్ వుంటుందో తెలియంది కాదు. అలాంటిది ఓ అభిమాని త‌ను అభిమానించే హీరోయిన్‌ని క‌ల‌వాల‌నుకుంటాడు. అనుకోకుండా హీరోయిన్ క‌లిస్తే.. ఆ రాత్రి ఏం జ‌రిగింద‌నేది ఈ చిత్ర ముఖ్య క‌థాంశం. సెప్టెంబర్ 2న విడుదల కాబోతోన్న ఈ చిత్ర ట్రైలర్‌ను.. తాజాగా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ (Sukumar) విడుదల చేశారు. ట్రైలర్ విడుదల అనంతరం సుకుమార్ మాట్లాడుతూ.. అభిరామ్ M (Abhiram M) దర్శకత్వంలో చంద్రప్రియ సుబుధి (Chandrapriya Subudhi) నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్ చాలా బాగుంది. సస్పెన్స్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు నా ఫ్రెండ్ మధు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా.. టీం అందరికీ మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని అన్నారు. 


చిత్ర దర్శకుడు అభిరామ్ మాట్లాడుతూ.. చాలా మంది ఈ టైటిల్ క్రేజీగా ఉందని పెట్టారా? అని అడుగుతున్నారు. అయితే టైటిల్‌కి తగ్గట్టే సినిమా కూడా ఉంటుంది. హీరోయిన్‌కి , అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామా ఇది. ఈ చిత్రంలో అన్ని పాత్ర‌లు హీరోయిన్ పాత్ర చుట్టూ తిరుగుతూ వుంటాయి. మధుగారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. బేబమ్మ పాత్రలో షకలక శంకర్ పాత్ర ఆద్యంతం న‌వ్విస్తుంది. కృష్ణ కాంత్‌గా రాజీవ్ కనకాల మరియు నోయల్, హీరోహీరోయిన్లు చాలా సపోర్ట్ చేశారు. నిర్మాత‌లు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా  నిర్మించారు. ఈ సినిమా క‌థలో మ‌లుపులు ప్రేక్ష‌కుడ్ని థ్రిల్ చేస్తాయని తెలపగా.. చిత్ర నిర్మాత చంద్రప్రియ సుబుధి మాట్లాడుతూ.. మా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసిన సుకుమార్‌గారికి ధన్యవాదాలు. ఈ కథకు హీరో, హీరోయిన్స్ అంటూ ఉండరు. కథే హీరో. కంటెంట్ ఉంటేనే ఏ చిత్రాన్ని అయినా ప్రేక్షకులు అదరిస్తారని నమ్ముతాను. అందుకే నేను కంటెంట్‌ను నమ్మి ఈ సినిమా నిర్మించాను. ద‌ర్శ‌కుడు అభిరామ్ ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టుగా ఈ చిత్రాన్ని చిత్రీక‌రించాడు. అందరూ ఎంతో కష్టపడ్డారు. సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులందరూ  ఆదరించాలని కోరుతున్నాను.. అన్నారు. (Die Hard Fan Trailer)



Updated Date - 2022-08-25T03:07:38+05:30 IST