Banaras: ‘పుష్ప’ సినిమానే స్ఫూర్తి అంటోన్న నిర్మాత

ABN , First Publish Date - 2022-06-29T02:44:28+05:30 IST

జైద్ ఖాన్, సోనాల్ మోన్‌టైరో హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘బనారస్’ . త్వర‌లోనే ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, క‌న్నడ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. జ‌య‌తీర్థ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి

Banaras: ‘పుష్ప’ సినిమానే స్ఫూర్తి అంటోన్న నిర్మాత

జైద్ ఖాన్, సోనాల్ మోన్‌టైరో హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘బనారస్’ (Banaras) . త్వర‌లోనే ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, క‌న్నడ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.  జ‌య‌తీర్థ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి తిల‌క్‌రాజ్ బ‌ల్లాల్ నిర్మాత‌. అజ‌నీష్ లోక్‌నాథ్ సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ సినిమా నుంచి ‘మాయ గంగ’  పాటను మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. 


పాట విడుదల అనంతరం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. ‘‘నిర్మాత తిలక్‌గారిది చాలా మంచి మ‌న‌సు. ఫ్రెండ్ కోసం.. జైద్ ఖాన్‌ కోసం ఇలా ఓ సినిమా చేయ‌డం గొప్ప విష‌యం. మంచి ప్రయ‌త్నం కోసం ఆయ‌న చేసిన ప్రయ‌త్నాన్ని అభినందిస్తున్నాను. మాయ గంగ పాట బ్యూటీ ఫుల్ మెలోడి. కె.కె. బ్యూటీఫుల్‌గా పాట‌ను రాశాడు. జ‌య‌తీర్థ డైరెక్ట్ చేసిన ‘బెల్ బాట‌మ్’ గురించి నేను చాలా విన్నాను. ఆహాలో  త‌ప్పకుండా చూస్తాను. అన్నం ఉడికిందా లేదా అని చూడ‌టానికి ఒక మెతుకు ప‌ట్టుకుంటే చాలన్నట్లు ‘బనారస్’ మూవీ గురించి ఈ మాయ గంగ సాంగ్ చెప్పేస్తుంది. చాలా చాలా బావుంది. ఎంటైర్ యూనిట్‌కి అభినంద‌న‌లు. జైద్‌గారి నాన్నగారు క‌న్నడ‌లో చాలా పెద్ద పొలిటీషియ‌న్‌. కానీ సినిమాల‌పై ఆస‌క్తితో జైద్ సినిమాల్లోకి వ‌చ్చాడు. త‌న‌కు సినిమాలంటే చాలా ప్యాష‌న్‌. చాలా బాగా చేశాడ‌ని పాట చూస్తేనే అర్థమ‌వుతుంది. త‌న‌కు విష్ యు ఆల్ ది బెస్ట్‌. పాన్ ఇండియా లెవ‌ల్లో సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. ఎంటైర్ టీమ్‌కు అభినంద‌న‌లు’’ అన్నారు.


నిర్మాత తిల‌క్‌రాజ్ బ‌ల్లాల్ మాట్లాడుతూ.. ‘‘మా సినిమాలోని పాటను రిలీజ్ చేయడానికి వచ్చిన సుకుమార్‌గారికి ధన్యవాదాలు. ఇక ‘బనారస్’  సినిమా గురించి చెప్పాలంటే ముందు హీరో జైద్ ఖాన్ గురించి చెప్పాలి. త‌నకు సినిమాలంటే ఎంతో ప్యాష‌న్‌. అది నేను గ‌మ‌నించాను. బిజినెస్ చేసుకోమ‌ని తండ్రి చెబుతున్నా.. సినిమా రంగంలోకి ఆస‌క్తిగా వ‌చ్చాడు. త‌న‌ని నేను ముంబైకి తీసుకొచ్చాను. త‌ను డెడికేష‌న్‌, హార్డ్ వ‌ర్క్‌తో అన్ని విష‌యాల‌ను తెలుసుకుని సినిమా చేశాడు. పాజిటివ్ వైబ్స్‌తో చేసిన ఈ సినిమాకు అంద‌రూ స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చారు. పుష్ప సినిమా ఇచ్చిన స్ఫూర్తితో మా సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. భాష ఏదైనా మంచి సినిమాల‌ను తెలుగు ప్రేక్షకుల మాదిరిగా ఎవ‌రూ ఆద‌రించ‌లేరని.. మా సినిమాను కూడా ఆద‌రించాల‌ని దర్శకుడు జయతీర్థ కోరారు.



Updated Date - 2022-06-29T02:44:28+05:30 IST