టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasarao) భార్య లక్ష్మీ కళ్యాణి (Lakshmi Kalyani) ఈ రోజు (మే 29) కన్నుమూశారు. ఉదయం 9గంటల 10 నిమిషాలకు తమ స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని సింగీతం మీడియా ముఖంగా తెలియజేస్తూ ఆమె మరణాన్ని ధ్రువ పరిచారు. సింగీతం సతీమణి మృతికి టాలీవుడ్ సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు. వీరిద్దరి దాంపత్య జీవితానికి 62 ఏళ్ళు. సింగీతం ప్రస్తుతం సినిమాలు తగ్గించి ఇంటికే పరిమితమయ్యారు.