Shiva Nirvana : రేంజ్ పెరుగుతోంది !

ABN , First Publish Date - 2022-08-28T15:57:33+05:30 IST

ఎంత పెద్ద హీరోనైనా కథతో పడగొట్టి.. దానికి తగ్గట్టుగానే టాలెంట్ చూపిస్తే.. అలాంటి దర్శకుడికి మంచి ఫ్యూచర్ ఉంటుందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒక ఫ్లాప్ పడినా.. అలాంటి వారి అవకాశాలకు మాత్రం ఎలాంటి ఢోకా ఉండదు.

Shiva Nirvana : రేంజ్ పెరుగుతోంది !

ఎంత పెద్ద హీరోనైనా కథతో పడగొట్టి.. దానికి తగ్గట్టుగానే టాలెంట్ చూపిస్తే.. అలాంటి దర్శకుడికి మంచి ఫ్యూచర్ ఉంటుందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.  ఒక ఫ్లాప్ పడినా.. అలాంటి వారి అవకాశాలకు మాత్రం ఎలాంటి ఢోకా ఉండదు. ఆ తరహా దర్శకుల్లో ముందు వరుసలో ఉన్నది శివ నిర్వాణ (Shiva Nirvana). ‘నిన్నుకోరి, మజిలీ’ లాంటి ఎమోషనల్ లవ్ స్టోరీస్ తీసి ప్రేక్షకుల మెప్పును పొందిన అతడి నెక్స్ట్ మూవీ ‘టక్ జగదీశ్’ (Tuck Jagdeesh) ఫ్లాప్ అయినప్పటికీ.. కెరీర్ కు ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వలేదు. పైగా పెద్ద బ్యానర్ లో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), సమంత (Samantha) జంటగా ‘ఖుషీ’ (Khushi) తెరకెక్కించే ఛాన్స్ కొట్టేశాడు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే శివ నిర్వాణ .. తదుపరి చిత్రం విక్టరీ వెంకటేశ్ (Venkatesh) తో ఉండబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. 


‘నారప్ప, దృశ్యం 2, ఎఫ్ 3’ చిత్రాలతో వరుసగా హిట్స్ కొట్టిన వెంకటేశ్.. ప్రస్తుతం రానా దగ్గుబాటి (Rana Daggubati) తో కలిసి ‘రానానాయుడు’ (Rana Naidu) వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ‘జాతిరత్నాలు’ (Jathi Ratnalu) ఫేమ్ అనుదీప్ కెవీ (Anudeep KV) వెంకీకి ఓ కథ చెప్పి మెప్పించినట్టు వార్తలొస్తున్నాయి. కాగా.. వెంకటేశ్.. శివ నిర్వాణ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల వెంకీకి శివ నిర్వాణ ఒక ఎమోషనల్ స్టోరీ చెప్పినట్టు, కథ నచ్చి వెంకటేశ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ కానున్నట్టు టాక్.  


ఫ్యామిలీ ఎమోషనల్ కాన్సెప్స్ట్ వెంకీకి కొత్తేమీ కాదు. గతంలో ఆ తరహా కథాంశాలతో తెరకెక్కిన చిత్రాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు వెంకీకి అలాంటి చిత్రాలు తీయడంలో దిట్టైన శివ నిర్వాణ తోడవుతున్నాడు. దాంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ ఇద్దరి కలయికలో తెరకెక్కనున్న చిత్రంపై అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. మరి వెంకీ కోసం శివ నిర్వాణ ఎలాంటి కథ రాసుకున్నాడో చూడాలి. 

Updated Date - 2022-08-28T15:57:33+05:30 IST