రామ్ న‌ట‌న‌లో ఓ ఫైర్ ఉంది : డైరెక్టర్ శంక‌ర్‌

ABN , First Publish Date - 2022-07-07T22:16:09+05:30 IST

ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్‌గా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన చిత్రం 'ది వారియర్'. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు.

రామ్ న‌ట‌న‌లో ఓ ఫైర్ ఉంది :  డైరెక్టర్ శంక‌ర్‌

ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్‌గా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన చిత్రం 'ది వారియర్'. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై  శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా  జూలై 14న ప్రపంచవ్యాప్తంగా  భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి.. పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. 


లెజెండరీ డైరెక్టర్ భార‌తీ రాజా మాట్లాడుతూ ‘‘మ‌ణిర‌త్నం.. నార్త్‌లో షూటింగ్ చేస్తోన్న శంక‌ర్ స‌హా ఇంత మంది ద‌ర్శకులు ఇక్కడ‌కు వచ్చారంటే కార‌ణం లింగుసామే. ఆయ‌న‌పై అభిమానమే. ‘ది వారియ‌ర్’ సినిమాను త‌ను తెర‌కెక్కించిన విధానం అద్భుతం. బుల్లెట్ సాంగ్, విజిల్ సాంగ్‌కు అద్భుత‌మైన కొరియోగ్రఫీ చేశారు. రామ్ ఇక్కడ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. త‌ను డాన్సులు చూశాను.. బ్యూటీఫుల్‌. ఓ రకంగా అసూయ ప‌డ్డాను. నాకు కాస్త వ‌య‌సు త‌క్కువ‌గా ఉండుంటే నేను కూడా వీరితో క‌లిసి చేసేవాడిని క‌దా అని అనిపించింది. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ ఎక్కడికో వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన గ్రాండియ‌ర్‌కు శంక‌ర్‌లాంటి ద‌ర్శకుడు దారి చూపించాడు. శంక‌ర్ ఆలోచ‌న‌ను చూస్తే ఆశ్చర్యపోతున్నాను. లింగుసామి టెక్నిక‌ల్‌గానూ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఇప్పుడున్న ద‌ర్శకులంతా గొప్ప గొప్పవారు. ఎన్నెన్ని జ‌న్మలెత్తినా సినిమా డైరెక్టర్‌గానే పుట్టాల‌ని కోరుకుంటాను’’ అన్నారు. 


కళాత్మక దర్శకుడు మ‌ణిర‌త్నం మాట్లాడుతూ ‘‘లింగుస్వామి ఈ సినిమా కోసం ఇంత మంది వారియ‌ర్స్‌ను తీసుకొస్తాడ‌ని తెలుసుంటే నా సినిమాకు సంబంధించిన వార్ సీన్స్‌ను ఇక్కడే చేసుండేవాడిని. లింగుస్వామి చాలా మంచి వ్యక్తి. కోవిడ్ స‌మ‌యంలో ఇక్కడ అంద‌రు డైరెక్టర్స్‌ను సంధానం చేశాడు. త‌న వ‌ల్ల నాకు ప్రతి ఒక డైరెక్టర్‌తో ప‌ర్సన‌ల్‌గానూ మంచి అనుబంధం ఏర్పడింది. నేను నా ‘పొన్నియ‌న్ సెల్వన్‌’ చిత్రాన్ని  హైద‌రాబాద్‌లో షూట్ చేస్తున్నప్పుడు లింగుస్వామి కూడా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఆయ‌న త‌ర్వగా పూర్తి చేసేశారు. ఆయ‌న రోడ్ బాగా వేస్తే .. వెన‌కాలే నేను కూడా వ‌చ్చేస్తాను. ది వారియ‌ర్ సినిమాలో న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు. 


స్టార్ డైరెక్టర్ శంక‌ర్ మాట్లాడుతూ ‘‘ది వారియర్.. చాలా మంచి టైటిల్. అందరం జీవితంలో ఏదో సాధించటానికి ఫైట్ చేస్తూనే ఉంటాం. కాబ‌ట్టి ఇది అంద‌రికీ సూట్ అయ్యే టైటిల్‌. ఈ సినిమాలోని బుల్లెట్ సాంగ్ స‌హా అన్ని పాట‌లు బావున్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌కి అభినంద‌న‌లు. రామ్ కోసం ఈ సినిమా చూడ‌బోతున్నాను. కృతి శెట్టి.. మంచి న‌టిగా ఎదిగి నేష‌న‌ల్ అవార్డ్‌ను ద‌క్కించుకోవాల‌ని అనుకుంటున్నాను. లింగుసామి మంచి స్నేహితుడు. క‌రోనా స‌మ‌యంలో నాకు చాలా స‌మ‌స్యలు వ‌చ్చాయి. త‌న‌తో చెప్పుకుంటే త‌ను అండ‌గా నిల‌బ‌డ్డారు. అంత మంచి వ్యక్తి చేసిన ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. వారియ‌ర్ ట్రైల‌ర్ చూశాను. చూస్తుంటే రామ్‌లో ఓ ఫైర్ క‌నిపించింది. వారియ‌ర్ సినిమా కోసం చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. 


హీరో రామ్ పోతినేని మాట్లాడుతూ ‘‘కోలీవుడ్ ఎంట్రీ కోసం 15 ఏళ్లుగా వెయిట్ చేశాను. అయితే ఈ రేంజ్ ఇంట్రడ‌క్షన్ ఉంటుంద‌ని అసలు ఊహించ‌లేదు. నాకే కాదు.. ఇండియ‌న్ సినిమాల్లోనే ఇంత మంది లెజెండ్స్ ఏ సినిమాకు కూడా వ‌చ్చి ఉండ‌రు. అది లింగుస్వామిగారి వ‌ల్లనే సాధ్యమైంది. ఇక్కడ‌కు వ‌చ్చిన ఒక్కొక్క గెస్ట్‌ను చూస్తే లింగు స్వామిగారు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు సాధించిన‌ట్లే అనిపిస్తుంది. ఆయ‌న్ని వ్యక్తిగా ఎంత ఇష్టప‌డుతున్నారో ఈ వేదిక‌ను చూస్తే అర్థమ‌వుతుంది. ఇంత గొప్ప డెబ్యూతో త‌మిళ్ ఎంట్రీ ఇస్తున్నందుకు ఆశీర్వాదంగా భావిస్తున్నాను. బుల్లెట్ సాంగ్ మాత్రమే కాదు.. ప్రతీ సాంగ్‌ను దేవిశ్రీ ప్రసాద్ ఎక్సలెంట్‌గా ఇచ్చాడు. 


అలాగే ఆది పినిశెట్టి నాకు సోద‌ర స‌మానుడు. త‌ను మంచి హీరో. అయితే ఓ క్యారెక్టర్‌ను విని దాన్ని నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లడ‌మ‌నేది చాలా గొప్ప విష‌యం. ఆది  ఈ సినిమాలో స‌గ భాగం. త‌ను ఈ పాత్ర చేసినందుకు థాంక్స్‌. కృతికి కూడా ఇది డెబ్యూ మూవీ. సూర్యగారు, శివ కార్తికేయ‌న్ స‌హా అంద‌రూ స‌పోర్ట్ చేసినందుకు థాంక్స్‌. న‌దియా గారితో క‌లిసి వ‌ర్క్ చేయ‌టం చాలా హ్యాపీగా ఉంది. నిర్మాత శ్రీనివాసా చిట్టూరిగారు చాలా మంచి వ్యక్తి. ఆయ‌న‌తో మ‌రో సినిమా చేయ‌బోతున్నాను. ఈ వేడుక‌లో మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించ‌డానికి వ‌చ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌’’ అన్నారు. ఇంకా డైరెక్టర్ లింగుసామి, దేవీశ్రీ ప్రసాద్, ఆది పినిశెట్టి, యస్.జె.సూర్య, విశాల్, సెల్వమణి, కథానాయిక కృతిశెట్టి , కార్తీక్ సుబ్బరాజ్‌, హీరో ఆర్య, బాలాజీ శ‌క్తివేల్, అన్బు చెలియ‌న్, పార్థిప‌న్ త‌దిత‌రులు పాల్గొని ‘ది వారియ‌ర్’ సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు.

Updated Date - 2022-07-07T22:16:09+05:30 IST