ఆ హీరోహీరోయిన్ల ‘లవ్వాట’ (Lavvaata) లోగో వదిలారు

ABN , First Publish Date - 2022-05-24T00:41:17+05:30 IST

నిడిగంటి సాయి రాజేష్ మూవీస్ (Nidiganti Sai Rajesh Movies) పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా.. ఆర్.కె. గాంధీ (RK Gandhi) దర్శకత్వంలో తెలుగు-తమిళ-కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న వినూత్న ప్రేమకథాచిత్రం ‘లవ్వాట’ (Lavvaata). ‘ప్రేమ గీమ జానేదో’ అనేది

ఆ హీరోహీరోయిన్ల ‘లవ్వాట’ (Lavvaata) లోగో వదిలారు

నిడిగంటి సాయి రాజేష్ మూవీస్ (Nidiganti Sai Rajesh Movies) పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా.. ఆర్.కె. గాంధీ (RK Gandhi) దర్శకత్వంలో తెలుగు-తమిళ-కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న వినూత్న ప్రేమకథాచిత్రం ‘లవ్వాట’ (Lavvaata). ‘ప్రేమ గీమ జానేదో’ అనేది ఉపశీర్షిక. ‘రావణలంక’ (Ravana Lanka) చిత్ర ఫేమ్ క్రిష్ బండిపల్లి (Krish Bandipally) హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా కన్నన్ (Meera Kannan), దీక్ష (Deeksha) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎన్. వెంకటేశ్వర్లు-బొట్టా శంకర్రావు-వెంకటగిరి శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు బెనర్జీ (Benerjee) ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ లోగోను హైదరాబాద్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్‪లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. చిత్ర కాన్సెప్ట్‪కు తగిన మంచి టైటిల్ సూచించమంటూ సోషల్ మీడియాలో నిర్వహించిన కాంటెస్ట్‪లో విజేతగా నిలిచిన మానే రామారావు (Maane RamaRao) ‘లవ్వాట’ టైటిల్ లోగోని లాంచ్ చేశారు. జూన్ 22 నుంచి శ్రీకాకుళం, మిర్యాలగూడ, హైదరాబాద్‪లలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది.


ఈ సందర్భంగా హీరో క్రిష్ బండిపల్లి మాట్లాడుతూ.. దర్శకుడు గాంధీ చెప్పిన కథ వింటే నేనే కాదు.. ఎంత పెద్ద హీరో అయినా టక్కున ఓకే చెబుతారు. సబ్జెక్ట్ విని స్పెల్ బౌండ్ అయిపోయాను.. అని తెలుపగా.. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం పట్ల హీరోయిన్లు మీరా, దీక్ష సంతోషం వ్యక్తం చేశారు. ‘లవ్వాట’లో తానొక కీలక పాత్ర పోషిస్తున్నానని, దర్శకుడిగా గాంధీకి ఉజ్వల భవిష్యత్ ఉందని బెనర్జీ పేర్కొన్నారు. ఈ చిత్రంతో నిర్మాతలుగా పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని నిర్మాతలు తెలిపారు.


అనంతరం చిత్ర దర్శకుడు ఆర్.కె. గాంధీ మాట్లాడుతూ.. ‘‘ నా మొదటి చిత్రం ‘ప్రేమభిక్ష’ (Prema Bhiksha) విడుదల కాకుండానే.. నా మూడో చిత్రం ‘లవ్వాట’ ప్రీ-ప్రొడక్షన్ పూర్తి చేసుకుని టైటిల్ లాంచ్ జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది. నా మొదటి, రెండవ చిత్రాలు ‘ప్రేమభిక్ష, రుద్రాక్షపురం (Rudraksha Puram)’ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటూ విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రేమ పట్ల నేటితరం దృక్పథం ఎలా ఉందో తెలుపుతూ.. వినోదాత్మకంగా సాగే చిత్రమిది. తెలుగుతో పాటు తమిళ-కన్నడ భాషల్లో రూపొందిస్తున్నాం. ఈ అవకాశమిచ్చిన నిర్మాతలకు, ప్రోత్సహిస్తున్న మిత్రులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు’’ అని అన్నారు.

Updated Date - 2022-05-24T00:41:17+05:30 IST