ఉపేంద్రతో వర్మ సినిమా.. నమ్మవచ్చా?

ABN , First Publish Date - 2021-09-19T21:50:19+05:30 IST

ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా తన తదుపరి ప్రాజెక్ట్స్ గురించి చాలా సింపుల్ గా అనౌన్స్ చేయడం రామ్ గోపాల్ వర్మ స్టైల్.

ఉపేంద్రతో వర్మ సినిమా.. నమ్మవచ్చా?

ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా తన తదుపరి ప్రాజెక్ట్స్ గురించి చాలా సింపుల్ గా అనౌన్స్ చేయడం రామ్ గోపాల్ వర్మ స్టైల్.  ఒకోసారి ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో కూడా తన నెక్స్ట్ మూవీస్ ను  ప్రకటించి .. తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారాయన. ఈ నేపథ్యంలో ఆయన ఓ సినిమాను అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చారు.  నిన్న ఉపేంద్ర పుట్టిన రోజు సందర్భంగా..  ఆయనతో తానో యాక్షన్ మూవీ చేయబోతున్నట్టు ట్విట్టర్ వేదికగా చెప్పారు వర్మ. అయితే ఉపేంద్ర దానికి ‘థాంక్యూ’ అని రిప్లై పెట్టారు కానీ..  అంతకు మించి మరే విధంగానూ స్పందించలేదు. అలాగే ఈ సినిమా గురించి తమ మధ్య డిస్కషన్స్ జరిగినట్టుగా కూడా ఆయన తెలపలేదు.  అందుకే ఈ ప్రాజెక్ట్ విషయంలో సందేహాలు తలెత్తుతున్నాయి. 


ఇటీవల ‘డియర్ మేఘ’ సినిమా ఫంక్షన్ లో ఆ సినిమా హీరో అదిత్ అరుణ్ తో తానో సినిమా చేయబోతున్నట్టు అక్కడికక్కడే అనౌన్స్ చేశారు వర్మ. అయితే ఇప్పటి వరకూ తనకి కూడా ఆ విషయం తెలియదని అదిత్  అరుణ్ చెప్పడం కొసమెరుపు. ఇప్పుడు ఉపేంద్ర విషయంలో కూడా అలాగే జరిగుంటుందా అని మాట్లాడుకుంటున్నారు.  ఒక  సినిమా ను ప్రకటించడం , ఆ తర్వాత దాని గురించి ఊసే ఎత్తకపోవడం ఆయనకు అలవాటే. గతంలో చాలా సార్లు అలా జరిగి ఉండడంతో .. సహజంగానే ఈ ప్రాజెక్ట్ పై కూడా డౌట్స్ రేజ్ అవుతున్నాయి.  మరి  నిజంగానే ఉపేంద్రతో వర్మ  సినిమా ఉంటుందో లేదో చూడాలి. 



Updated Date - 2021-09-19T21:50:19+05:30 IST