Prashanth neel : పారితోషికం రెట్టింపయ్యిందా?

ABN , First Publish Date - 2022-05-04T16:35:42+05:30 IST

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఇప్పటికి మూడు సినిమాల్ని డైరెక్ట్ చేశాడు. అవన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్. వాటిలో ‘కేజీఎఫ్’ సిరీస్ పాన్ ఇండియా స్థాయిలోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ దుమ్మురేపేశాయి. దీంతో అతడి క్రేజ్ డబుల్ అయింది. ఈ సినిమాలు తెచ్చిపెట్టిన సక్సెస్ క్రెడిట్ తో Prashanth neel తెలుగులో ఏకంగా మూడు సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఆల్రెడీ ప్రభాస్ హీరోగా ఒక సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.

Prashanth neel : పారితోషికం రెట్టింపయ్యిందా?

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఇప్పటికి మూడు సినిమాల్ని డైరెక్ట్ చేశాడు. అవన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్. వాటిలో ‘కేజీఎఫ్’ సిరీస్ పాన్ ఇండియా స్థాయిలోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ దుమ్మురేపేశాయి. దీంతో అతడి క్రేజ్ డబుల్ అయింది. ఈ సినిమాలు తెచ్చిపెట్టిన సక్సెస్ క్రెడిట్ తో Prashanth neel తెలుగులో ఏకంగా మూడు సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఆల్రెడీ ప్రభాస్ హీరోగా ఒక సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. ఈ సినిమాకోసం Prashanth neel ఏకంగా రూ.25కోట్లు పారితోషికం అందుకున్నాడు. అయితే కొత్త చిత్రాలకోసం అతడు తన పారితోషికాన్ని రెట్టింపు చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. సలార్ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్.. యన్టీఆర్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. అలాగే.. రామ్‌చరణ్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. 


ఈ రెండు తెలుగు సినిమాలకు గాను ప్రశాంత్ నీల్ ఏకంగా రూ. 50కోట్లు పారితోషికం అందుకోబోతున్నాడని టాక్. అలాగే.. ‘కేజీఎఫ్ 2’ చిత్రానికి పారితోషికంతో పాటు లాభాల్లో వాటాని కూడా అందుకోనున్నాడని సమాచారం. అయితే తదుపరిగా అతడు చేయబోయే తెలుగు సినిమాల విషయంలో నిర్మాతలు అతడికి కేవలం రూ. 50 కోట్ల పారితోషికం మాత్రమే అందిస్తారని తెలుస్తోంది. రాజమౌళి తర్వాత అతడి స్థాయిలో జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న Prashanth neel తన పారితోషికాన్ని డబుల్ చేయడం పెద్ద విశేషం కాదు. అలాగే.. అతడు డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ ను ఇవ్వడానికి తెలుగు నిర్మాతలు రెడీగా ఉన్నారు. మరి ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయితే ప్రశాంత్ ఇంకెంత పారితోషికం డిమాండ్ చేస్తాడో చూడాలి.  

Updated Date - 2022-05-04T16:35:42+05:30 IST