Bimbisara : ఒకప్పటి హీరోనే ఈ సినిమా డైరెక్టర్ !

ABN , First Publish Date - 2022-08-03T20:59:43+05:30 IST

‘ఎంత మంచివాడవురా’ (Entha Manchivadavura) చిత్రం తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyanram) నటిస్తున్న చిత్రం ‘బింబిసార’ (Bimbisara). టైమ్ ట్రావెలింగ్ నేపథ్యంలో సోషియో ఫాంటసీ కథాంశంగా ఈ సినిమా రూపొందుతోంది.

Bimbisara : ఒకప్పటి హీరోనే ఈ సినిమా డైరెక్టర్ !

‘ఎంత మంచివాడవురా’ (Entha Manchivadavura) చిత్రం తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyanram) నటిస్తున్న చిత్రం ‘బింబిసార’ (Bimbisara). టైమ్ ట్రావెలింగ్ నేపథ్యంలో సోషియో ఫాంటసీ కథాంశంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇదివరకు విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో  భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 5న థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. ఈ సినిమాతో మల్లిడి వశిష్ట్ (Mallidi Vasist) టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అయితే కొత్త దర్శకుడి చేతికి కళ్యాణ్ రామ్ ఇంతటి భారీ చిత్రాన్ని అప్పగించడం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లోని విజువల్స్‌కు అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యన్టీఆర్ (NTR) సైతం దర్శకుడి ప్రతిభను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. 


సాధారణ ప్రేక్షకులకు వశిష్ట్ గురించి అంతగా తెలియకపోవచ్చు కానీ, ఇండస్ట్రీ జనానికి అతడు సుపరిచితుడే. అతడి నేపథ్యం, ఇండస్ట్రీలో అతడి జెర్నీ ఆసక్తిని రేకెత్తించేవే. ఇంతకీ దర్శకుడు వశిష్ట్ ఎవరో తెలుసా? 15 ఏళ్ళ క్రితం అతడో సినిమాలో హీరోగా నటించాడు. ఆ సినిమా పేరు ‘ప్రేమలేఖ రాశా’ (Premalekha Rasa). దర్శకుడు తేజ (Teja) తొలి చిత్రం ‘చిత్రం’ (Chitram) తో టాలీవుడ్ కు గీత రచయితగా పరిచయం అయిన కులశేఖర్‌ (Kulasekhar) ఈ సినిమాతోనే దర్శకుడిగా మారాడు.  అలాగే ఇదే చిత్రంతో ప్రముఖ గాయకుడు రామాచారి (Ramachari) సంగీత దర్శకుడిగానూ మారారు. శ్రీరామ్ కౌశిక్ (Sriram Koushik) పేరుతో ఆయన ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ సినిమాకానీ హిట్టయ్యుంటే.. వశిష్ట్ కు హీరోగా మరిన్ని అవకాశాలు వచ్చేవేమో. ‘ఢీ’ (Dhee) తో సహా పలు చిత్రాలను నిర్మించిన మల్లిడి సత్యనారాయణ తనయుడే ఈ వశిష్ట్. ఇతడి అసలు పేరు మల్లిడి వేణు (Mallidi Venu). ఆ పేరుతోనే ‘ప్రేమలేఖ రాశా’ చిత్రంతో పరిచయం అయ్యాడు. 


తను నటనకు సూట్ కానని ఫిక్సయి.. దర్శకత్వ శాఖలో చేరాడు వశిష్ట్. నిజానికి అతడు ఎన్నో ఏళ్ళ క్రితమే దర్శకుడు కావాల్సింది. రవితేజ (Raviteja), అల్లు శిరీశ్ (Allu Sirish) లతో సినిమాలు ఓకే అయినట్టే అయి..  వెనక్కి వెళ్ళిపోయాయి. ‘శ్రీరస్తు శుభమస్తు’ (Srirasthu Shubhamastu) తర్వాత అల్లు శిరీష్ తో ఒక సినిమాను ప్రకటించారు. అయితే బడ్జెట్ సమస్యలతో సినిమా సెట్స్ పైకి వెళ్ళలేకపోయింది. ఎట్టకేలకు ఇప్పుడు కళ్యాణ్ రామ్ ను మంచి కథతో బాగా ఇంప్రెస్ చేసి ‘బింబిసార’ దర్శకుడిగా మారాడు.  ఈ సినిమాకానీ ఘన విజయం సాధిస్తే మల్లిడి వశిష్ట్ కు దర్శకుడిగా దశతిరిగినట్టే. 

Updated Date - 2022-08-03T20:59:43+05:30 IST