‘లింగా’ సినిమా పరాజయానికి కారణమదే : KS Ravikumar

ABN , First Publish Date - 2022-07-21T20:39:44+05:30 IST

2014 డిసెంబరులో వచ్చిన చిత్రం ‘లింగా’ (Linga). సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajanikanth), సోనాక్షి సిన్హా (Sonakshi Sinha), అనుష్కశెట్టి (Anushka Shetty), జగపతిబాబు (jagapathibabu), సంతానం (Santhanam), కె.విశ్వనాథ్‌ (K Viswanath), బ్రహ్మానందం (Brahmanandam), కరుణాకరన్‌ (Karunakaran) తదితరులు నటించగా, కేఎస్ రవికుమార్‌ (KS Ravikumar) దర్శకత్వం వహించారు.

‘లింగా’ సినిమా పరాజయానికి కారణమదే : KS Ravikumar

2014 డిసెంబరులో వచ్చిన చిత్రం ‘లింగా’ (Linga). సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajanikanth), సోనాక్షి సిన్హా (Sonakshi Sinha), అనుష్కశెట్టి (Anushka Shetty), జగపతిబాబు (jagapathibabu), సంతానం (Santhanam), కె.విశ్వనాథ్‌ (K Viswanath), బ్రహ్మానందం (Brahmanandam), కరుణాకరన్‌ (Karunakaran) తదితరులు నటించగా, కేఎస్ రవికుమార్‌ (KS Ravikumar) దర్శకత్వం వహించారు. మునిరత్న సమర్పణలో రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ప్రై లిమిటెడ్‌ బ్యానరులో రాక్‌లైన్‌ వెంకటేష్‌ (Rockline Venkatesh) నిర్మించారు.  రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తాకొట్టింది. ఈ చిత్రం పరాజయంపై దర్శకుడు కేఎస్ రవికుమార్‌ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.


‘లింగా’ చిత్రం నిరాశపరచడానికి కారణం నేనుగానీ, నా అసిస్టెంట్లు కాదు. నేను రాసిన కథను పూర్తిగా మార్చేశారు. అది నాతోపాటు నా సహాయ దర్శకుల్లో ఒక్కరికీ కూడా నచ్చలేదు. కొంతమంది జోక్యంతో సినిమా స్టోరీ పూర్తిగా మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్లైమాక్స్‌ మరోలా చిత్రీకరించాం. రజనీకాంత్‌ పుట్టిన రోజునే విడుదల చేయాలన్న ఒత్తిడి తెచ్చారు. అపుడు అనిపించింది.. నేను కూడా దర్శకుడు శంకర్‌ (Shankar) లాగా ఉండాలని. ఎందుకంటే. శంకర్‌.. ఫస్ట్‌కాపీ చూసిన తర్వాత ఏదైనా మార్పులు చేర్పులు, రీషూట్‌ చేసి కాపీ పక్కాగా సిద్ధమైన తర్వాతే పబ్లిసిటీ ప్రారంభించి, రిలీజ్‌ తేదీ  ప్రకటిస్తారు’ అని వివరించారు.

Updated Date - 2022-07-21T20:39:44+05:30 IST