మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన మొద‌టి గిఫ్ట్ అదే: ‘రంగ రంగ వైభ‌వంగా’ దర్శకుడు

ABN , First Publish Date - 2022-06-28T02:08:27+05:30 IST

‘ఉప్పెన’ (Uppena) సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న యువ హీరో పంజా వైష్ణవ్ తేజ్ (Vaisshnav Tej). ఆయన హీరోగా శ్రీ వెంక‌టేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బాపినీడు.బి స‌మ‌ర్పణ‌లో.. తమిళంలో ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) చిత్రాన్ని

మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన మొద‌టి గిఫ్ట్ అదే:  ‘రంగ రంగ వైభ‌వంగా’ దర్శకుడు

‘ఉప్పెన’ (Uppena) సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న యువ హీరో పంజా వైష్ణవ్ తేజ్ (Vaisshnav Tej). ఆయన హీరోగా శ్రీ వెంక‌టేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బాపినీడు.బి స‌మ‌ర్పణ‌లో.. తమిళంలో ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ (Gireeshaaya) ద‌ర్శకత్వంలో.. సీనియర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్ (BVSN Prasad) నిర్మిస్తోన్న చిత్రం ‘రంగ రంగ వైభ‌వంగా’ (Ranga Ranga Vaibhavanga). వైష్ణవ్ సరసన కేతికా శ‌ర్మ (Ketika Sharma) హీరోయిన్‌‌గా నటించింది. ప్రస్తుతం ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ చిత్రం టీజర్‌ని హైదరాబాద్ ఏఎమ్‌బీ సినిమాస్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. త్వర‌లోనే సినిమాను రిలీజ్ చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నట్లుగా తెలిపారు. 


టీజర్ విడుదల అనంతరం చిత్ర దర్శకుడు గిరీశాయ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీది ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకుంది. ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమా ఇక్కడ‌కు వ‌చ్చిందంటే దానికి కార‌ణం.. వైష్ణవ్ తేజే. ఓ హీరోను క‌లిసి క‌థ చెప్పట‌మంటే చాలా క‌ష్టం. కానీ ఒక్క ఫోన్ కాల్‌తోనే ఆయ‌న నన్ను క‌లిసి నా క‌థ‌ను విన్నారు. నేను తిరిగి వెళ్లేట‌ప్పుడు ఆయ‌న నాకు చాక్లెట్ బాక్స్ గిఫ్ట్‌గా ఇచ్చారు. మెగా ఫ్యామిలీ నుంచి నాకు వ‌చ్చిన మొద‌టి గిఫ్ట్ అదే. నేనే కాదు.. మా ఫ్యామిలీ అంతా మెగాస్టార్‌ చిరంజీవిగారి వీరాభిమానులం. దాంతో ఆరోజు రాత్రి మేమెవరం నిద్ర కూడా పోలేదు. మ‌ర‌చిపోలేని ఫీల్ ఇచ్చిన‌, గొప్ప అవ‌కాశం ఇచ్చిన వైష్ణవ్ తేజ్‌కి థాంక్స్‌. పాట‌లు రిలీజ్ అయిన‌ప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేసి వైష్ణవ్‌గారి లుక్ అదిరిపోయింద‌ని, చించేశార‌ని అన్నారు. నిజంగానే మా సినిమాలో వైష్ణవ్‌గారు కొత్తగా క‌నిపిస్తారు. ఆయ‌న ఎన‌ర్జీ నెక్ట్స్ లెవ‌ల్‌లో ఉంటుంది. ఆయ‌న ఎన‌ర్జీయే మా ‘రంగ రంగ వైభ‌వంగా’ సినిమా. మా సినిమాను చాలా హ్యాపీగా పూర్తి చేశామంటే నిర్మాత ప్రసాద్‌గారు, బాపినీడుగారే కార‌ణం. మేం రాధ పాత్రకు చాలా మంది హీరోయిన్స్‌ని అనుకున్నాం. చాలా మందికి లుక్ టెస్ట్ చేశాం. ఓరోజు కేతికా శ‌ర్మ లుక్ టెస్ట్ చేసిన‌ప్పుడు ఆమె క‌ళ్లు చూడ‌గానే.. ఆమెనే నా సినిమాలో రాధ అని ఫిక్స్ అయిపోయాను. త‌ను అద్భుతంగా ఆ పాత్రను క్యారీ చేసింది. అందుకు థాంక్స్‌. దేవిశ్రీప్రసాద్‌గారితో ఓ సినిమా అయినా ప‌ని చేయాల‌ని అనుకునేవాడిని. నా తొలి సినిమానే ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంది. సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్‌గారు మంచి విజువ‌ల్స్ ఇచ్చారు. అవినాష్ కొల్లగారు మంచి ఎఫ‌ర్ట్ పెట్టి వ‌ర్క్ చేశారు. ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ వంటి అర్జున్ ప్రసాద్ క్యారెక్టర్‌ను నవీన్ చంద్రగారు చేశారు. మా ఎంటైర్ టీమ్‌కి థాంక్స్‌. ఈ సినిమా చూసిన త‌ర్వాత నా సామి రంగా.. రంగ రంగ వైభ‌వంగా అని మెగా ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. అందుకు నాది గ్యారంటీ..’’ అని అన్నారు. 



Updated Date - 2022-06-28T02:08:27+05:30 IST