రూ.900 కోట్ల నిధులను ఏం చేశారు?: గత పాలకులపై దర్శకుడు ఆగ్రహం

ABN , First Publish Date - 2021-11-10T01:56:45+05:30 IST

నగరంలో వర్షపు నీరు నిల్వకుండా ఉండేందుకు ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం అమలు కోసం కేంద్రం నుంచి రూ.900 కోట్ల మేర నిధులను పొందింది. అవి ఏం చేశారంటూ ప్రశ్నించారు. పైగా ఈ పథకం అమలు తీరు ఇదేనా..

రూ.900 కోట్ల నిధులను ఏం చేశారు?: గత పాలకులపై దర్శకుడు ఆగ్రహం

గత అన్నాడీఎంకే పాలకులపై సినీ దర్శకుడు చేరన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నై నగరంలో వర్షపు నీరు నిల్వకుండా ఉండేందుకు వీలుగా ప్రవేశపెట్టిన పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి పొందిన కోట్లాది రూపాయల నిధులను ఏం చేశారంటూ ఆయన ప్రశ్నించారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షంతో చెన్నై మహానగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. 


దీనిపై చేరన్‌ స్పందిస్తూ.. గత ప్రభుత్వం చెన్నై నగరంలో వర్షపు నీరు నిల్వకుండా ఉండేందుకు ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం అమలు కోసం కేంద్రం నుంచి రూ.900 కోట్ల మేర నిధులను పొందింది. అవి ఏం చేశారంటూ ప్రశ్నించారు. పైగా ఈ పథకం అమలు తీరు ఇదేనా అంటూ ప్రశ్నించారు. ఇందుకోసం తయారు చేసిన ఫైలును ముఖ్యమంత్రి స్టాలిన్‌ ముందుగా బయటకు తీసి తగిన చర్యలు తీసుకోవాలంటూ దర్శకుడు చేరన్‌ తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ చేసి, తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయానికి ట్యాగ్‌ చేశారు.

Updated Date - 2021-11-10T01:56:45+05:30 IST