మోడ్రన్ మైథాలజీగా Brahmastra.. ఆ పాత్రకి మొదటి ఛాయిస్ Nagarjuna నే: Ayan Mukerji

ABN , First Publish Date - 2022-07-12T18:13:55+05:30 IST

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘బ్రహ్మాస్త్ర (Brahmastra)’...

మోడ్రన్ మైథాలజీగా Brahmastra.. ఆ పాత్రకి మొదటి ఛాయిస్ Nagarjuna నే: Ayan Mukerji

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘బ్రహ్మాస్త్ర (Brahmastra)’. తెలుగులో ఈ సినిమా ‘బ్రహ్మస్త్రం’ పేరుతో రిలీజ్ కానుంది. రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ జంటగా నటిస్తున్నఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీ రాయ్‌ పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ మూవీని సెప్టెంబర్ 9 (09.09.2022)న విడుదల చేయనున్నారు. ఈ తరుణంలో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ‘బ్రహ్మాస్త్ర’ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.


బ్రహ్మస్త్ర సినిమాతో మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు?

‘బ్రహ్మస్త్ర’ సినిమాలో చాలా విషయాలు చర్చించాలని అనుకుంటున్నాను. ఒక ఫాంటసీ సినిమా చెయ్యాలనుకున్నపుడు నన్ను చాలా విషయాలు ఇన్‌స్పైర్ చేశాయి. ఈ సినిమాలో మనదేశ సంస్కృతి, పురాణాలు, గొప్ప కథలను డైరెక్ట్‌‌గా చెప్పకుండా నా పద్ధతిలో చూపించాను. మీరు ఈ సినిమాను చూస్తున్నప్పుడు భారతదేశం ఆత్మ, అలాగే ఆధ్యాత్మికతను కొత్తగా అనుభూతి చెందుతారు.


అమితాబ్ బచ్చన్, అలియా భట్, నాగార్జున వంటి లెంజెండరీ నటుల సెలెక్షన్ మీదేనా? 

నిజంగా చెప్పాలంటే కథను రాసుకున్నప్పుడే ఈ పాత్ర కోసం అమితాబ్ బచ్చన్, ఈ పాత్ర కోసం అలియా, అలానే ఈ పాత్ర కోసం నాగార్జున కావాలి అనుకున్నాం. ఈ పాత్రకు నాగార్జున పర్ఫెక్ట్ అనిపించింది. అందుకే ఆయనకు కథ వినిపించగా.. ఆయనకు బాగా నచ్చింది. ‘బ్రహ్మాస్త్ర’ చూస్తున్నప్పుడు ఇది మన సినిమా అనే అనుభూతి కలుగుతుంది. 


ఈ సినిమాను మీరు మోడ్రన్ మైథాలజీ అని ఎలా చెబుతున్నారు?

ఈ సినిమా మోడ్రన్ ఇండియా 2022లో జరుగుతుంది. అంటే ఇది ప్రస్తుత సినిమానే. ‘బ్రహ్మాస్త్ర’ అనే టైటిల్ వినగానే కొంతమంది ఇది పీరియాడిక్ ఫిలిం అనుకుంటారు. నిజానికి మోడరన్ ఫిలిం, ఈ సినిమా కథకి ప్రేరణ ఇండియన్ మైథాలజీ. అందుకే దీనిని మోడరన్ మైథలాజి అని చెప్పాను.  


మూడు భాగాలుగా రానున్న ‘బ్రహ్మాస్త్ర’లో ఫస్ట్ పార్ట్‌గా శివని తీసుకోవడానికి కారణం?

వాస్తవంగా చెప్పాలంటే నిజంగా కనెక్షన్ అంటూ ఏమి లేదు. లార్డ్ శివ‌కి దేనినైనా సృష్టించే శక్తితో పాటు.. మూడో కన్ను తెరిచి   దేనినైనా నాశనం చేసే శక్తీ కూడా ఉంది. ఈ కాన్సెప్ట్‌లో ‘బ్రహ్మాస్త్ర’ పవర్‌ను ఎవరు కంట్రోల్ చెయ్యలేరు. 


మన పురాణాల్లో చాలామంది సూపర్ హీరోస్ ఉన్నారు. మొదట మీరే వారిని భారతీయ సినిమాకు పరిచయం చేస్తున్నారు. కానీ ఎందుకు ఇంత లేట్ అయింది?

నాకు ఈ ఆలోచన వచ్చినప్పుడు చాలా త్వరగా చేసేయాలి అనిపించింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్నో హాలీవుడ్ సినిమాలు 10, 20 సంవత్సరాల క్రితం రాసిన కామిక్ బుక్స్ ఆధారంగా తీసినవే. వాటితోనే అంత కంటెంట్ క్రియేట్ చేసి ఆదరణ పొందారు. అలాంటప్పుడు ఎన్నో గొప్ప గొప్ప కథలు, పురాణ ఇతిహాసాలు ఉన్న మన భారతీయ చరిత్రను యధార్థంగా ఎందుకు చూపించలేమనిపించింది. 2011లో నాకు ఈ ఆలోచన వచ్చింది అలానే అప్పటి నుంచి ఇప్పటివరకు టెక్నాలజీ కూడా బాగా డెవలప్ అయింది. అది కూడా కొంతవరకు కలిసొచ్చింది.


స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. సినిమాని హిందీతోపాటు తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.

Updated Date - 2022-07-12T18:13:55+05:30 IST