ద‌ర్శ‌క‌త్వం నా వృత్తి కాదు: P.C. Sri Ram

ABN , First Publish Date - 2022-07-21T19:36:39+05:30 IST

ద‌ర్శ‌క‌త్వం నా వృత్తి కాదు.. అన్నారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీ‌రామ్ (P.C. Sri Ram). ఆయన సినిమాటోగ్రఫీ అందించిన తాజా చిత్రం థాంక్యూ (Thankyou). ఇందులో అక్కినేని నాగ చైతన్య (Naga Chatanya),

ద‌ర్శ‌క‌త్వం నా వృత్తి కాదు: P.C. Sri Ram

ద‌ర్శ‌క‌త్వం నా వృత్తి కాదు.. అన్నారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీ‌రామ్ (P.C. Sri Ram). ఆయన సినిమాటోగ్రఫీ అందించిన తాజా చిత్రం థాంక్యూ (Thankyou). ఇందులో అక్కినేని నాగ చైతన్య (Naga Chatanya), రాశీ ఖన్నా (Rashi Khanna) జంటగా నటించారు. విక్రమ్ కె కుమార్ దర్శకుడు. సాయి సుశాంత్ రెడ్డి, మాళవిక నాయర్, అవికా గోర్, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. దిల్ రాజు (Dil Raju) నిర్మించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు. ఇంకొన్ని గంటల్లో ఈ చిత్రం భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నేటి రాత్రి నుంచే ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. అయితే, ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీ‌రామ్ మాట్లాడారు.


ఈ సందర్భంగా ఆయన.."ఈరోజుల్లో మానవ సంబంధాల‌కు చాలామంది అంతగా విలువ ఇవ్వ‌డం లేదు. క‌నీసం చేసిన స‌హాయానికి థ్యాంక్స్ కూడా చెప్పడం లేదు. అలా చెప్పినా దానిలో కృత్రిమ‌త్వ‌మే ఎక్కువ‌ కనిపిస్తోంది. అలాంటి రోజుల్లో థ్యాంక్యూ లాంటి సినిమా రావ‌డం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చూసిన ప్ర‌తి ఒక్కరికీ థ్యాంక్యూ అనే మాట‌కు ఎంత విలువ ఇవ్వాలో తెలుస్తుంది. టెక్నాల‌జీ పరంగా ఎప్పటికపుడు చాలా మార్పులు వ‌స్తుంటాయి. రోజు రోజుకీ వంద‌ల ర‌కాలుగా టెక్నాల‌జీ అప్ డేట్ అవుతుంటుంది. ప్ర‌తీ ఒక్క‌రికీ ఓ విజ‌న్ ఉంటుంది. నాకూ ఉంటుంది. నా విజ‌న్‌లో సినిమాని చూస్తా. ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ‌ని నా కోణంలో తెర‌పైన ఆవిష్క‌రించ‌డానికే ప్ర‌య‌త్నిస్తా. 


నేను ఏ సినిమా చేసినా, నా వ‌ర్కే డామినేట్ చేస్తుంద‌ని అందరూ అనుకుంటారు. ఇది నిజం కాదు. క‌థ‌కి ఏం కావాలో అదే ఇస్తాను. ఎవ‌రైనా అభ‌ద్ర‌తా భావంలో ఉంటే నేను డామినేట్ చేస్తున్న‌ట్టు అనిపిస్తుంది. నేను సినిమా ఒప్పుకునే ముందు క‌థ మొత్తం వింటా. అప్పుడే ద‌ర్శ‌కుడు ఏం చెప్పాల‌నుకుంటున్నాడో, నేను ఆ క‌థ‌ని ఎలా చూపించాలో నాకు అర్థం అవుతుంది. ఏదో రెండు మాట‌లు చెప్పి, అడ్వాన్స్ చేతిలో పెడితే సినిమా ఒప్పుకోలేను. ఓక‌థ‌కు నేను ఎమోష‌న‌ల్ గా క‌నెక్ట్ అవ్వాలి. అప్పుడే నా లెన్స్ నుంచి ప్ర‌జెంట్ చేయ‌గ‌ల‌ను.డెర‌క్ష‌న్‌, కెమెరా రెండూ వేర్వేరు. ద‌ర్శ‌క‌త్వం నా వృత్తి కాదు. ఆ ప్ర‌య‌త్నం చేసినా నేను స‌ఫ‌లం కాలేదు. ఎప్పుడూ మెగా ఫోన్ ప‌ట్టాల‌న్న ఆలోచ‌న లేదు''.. అని అన్నారు. 

Updated Date - 2022-07-21T19:36:39+05:30 IST