Dil-Wala: వీరభద్రం చౌదరి దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభం..

ABN , First Publish Date - 2022-08-13T18:28:19+05:30 IST

వీరభద్రం చౌదరి (Veerabhadram Chowdary) దర్శకత్వంలో కొత్త చిత్రం 'దిల్ వాలా' (Dil-Wala) ప్రారంభం అయింది. సునీల్ హీరోగా 'పూలరంగడు', ఆది సాయి కుమార్‌తో 'చుట్టాలబ్బాయి'

Dil-Wala: వీరభద్రం చౌదరి దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభం..

వీరభద్రం చౌదరి (Veerabhadram Chowdary) దర్శకత్వంలో కొత్త చిత్రం 'దిల్ వాలా' (Dil-Wala) ప్రారంభం అయింది. సునీల్ హీరోగా 'పూలరంగడు', ఆది సాయి కుమార్‌తో 'చుట్టాలబ్బాయి' లాంటి సూపర్ హిట్ చిత్రాలను రూపొందించి టాలీవుడ్‌లో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు వీరభద్రం చౌదరి. ఆ తర్వాత 'మత్తువదలారా', 'సేనాపతి' చిత్రాలతో సినీ ప్రముఖుల ప్రసంశలు అందుకున్నారు. ఇప్పుడు ఆయన నరేష్ అగస్త్య (Naresh Agastya) హీరోగా డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్ పై నబిషేక్, తూము నర్సింహా పటేల్ నిర్మిస్తున్న 'దిల్ వాలా' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 


తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ లో దర్శకుడు వివి వినాయక్, హీరో అల్లరి నరేష్, ప్రముఖ కమెడియన్ అలీ ముఖ్య అతిథులుగా పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు వీరభద్రం చౌదరి మాట్లాడుతూ.. 'వివి వినాయక్ గారు సినిమాకి క్లాప్ కొట్టి ఆశీర్వాదించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే, మా మొదటి సినిమా హీరో అల్లరి నరేష్ గారు ఇక్కడి వచ్చి బెస్ట్ విశేష్ అందించడం, అలీ గారు రావడం సంతోషంగా ఉంది. మా నిర్మాతలు నబీషేక్, తూము నర్సింహా గారు ఈ మూవీతో డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్ ని ప్రారంభించారు. నేను మొదలు పెట్టిన నిర్మాతలందరూ చాలా సక్సెస్ అయ్యారు. నబీషేక్ గారు కూడా పెద్ద స్థాయిలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను'..అన్నారు. 


నరేష్ అగస్త్య మాట్లాడుతూ.. 'వీరభద్రం చౌదరి గారు కథ చెప్పిన తర్వాత 3 రోజుల్లోనే సినిమా ఓకే చేశాను. ఈ మూవీ కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వందశాతం నా వర్క్ ని ఇస్తా. మొదటిసారి ఒక కమర్షియల్ సినిమా చేయబోతున్నా. నాకు కూడా కొంచెం టెన్షన్ గా ఉంది. ఆడియన్స్ కి మరింత దగ్గరవ్వాలని ఉంది' అని చెప్పుకొచ్చారు. 


ఇదే సందర్భంగా చిత్ర నిర్మాత నబిషేక్ మాట్లాడుతూ.. 'వీరభద్రం చౌదరి దర్శకత్వంలో డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మాతగా ఇప్పుడు 'దిల్ వాలా' చిత్రంతో పరిచయం అవుతున్నాను. ఇందులో నరేష్ అగస్త్య హీరోగా.. శ్వేత అవస్తి హీరోయిన్‌గా నటిస్తున్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను నిర్మిస్తాను'.. అని తెలిపారు.

Updated Date - 2022-08-13T18:28:19+05:30 IST